రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని మహిళ మృతి
ముద్ర ప్రతినిధి, బీబీనగర్: బీబీనగర్ – ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు పట్టాలపై గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గురువారం ఉదయం కనుగొన్నారు. మృతి చెందిన మహిళ వయసు 20 నుంచి 25 సంవత్సరాలు ఉండవచ్చునని తెలిపారు. ప్రయాణిస్తున్న రైలు నుంచి జారిపడి చనిపోయి వుంటుందని, గురువారం ఉదయం 6.45 గంటల సమయంలో జరిగివుండొచ్చునని రైల్వే పోలీసులు తెలిపారు.
మృతదేహంపై పింక్ కలర్ లెగ్గింగ్, బూడిద రంగు టాప్, రెండు చెవులకు కమ్మలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మహిళ మృతదేహాన్ని భువనగిరి ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచామని తెలిపారు. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే నల్లగొండ రైల్వే పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ 8712658595 మొబైల్ నెంబర్ కు కాల్ చేసి తెలుసుకోవచ్చునని పేర్కొన్నారు.