యువకుడిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

యువకుడిపై ఇద్దరు యువకుల లైంగిక దాడి

కేసు నమోదు చేసిన పోలీసులు

మెట్‌పల్లి ముద్ర:- జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. ఓ యువకుడి(19) పై అదే పట్టణానికి చెందిన మరో ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పట్టణానికి చెందిన ఓ యువకుడిని నజీర్, ఉమర్ లు మభ్యపెట్టి ద్విచక్రవాహనంపై అడవిలోకి తీసుకెళ్లారు. అక్కడ యువకుడిపై  లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.