తాటిపల్లి దారి దోపిడి దొంగలు దొరికారు

తాటిపల్లి దారి దోపిడి దొంగలు దొరికారు

డ్రైవరే సూత్రదారి
11 మంది నిండుతులు అరెస్ట్
ముద్ర ప్రతినిధి, మెదక్:  మెదక్ జిల్లా రేగోడ్ మండలం తాటిపల్లి వద్ద జరిగిన దారి దోపిడి దొంగలు దొరికారు. డబ్బుపై ఆత్యాశతో  ఈ దారి దోపిడీ చేయించి కటాకటాలపాలయ్యడు. దొంగతనం జరిగిన వెంటనే మెదక్ డి.ఎస్.పి సైదులు  ఆద్వర్యంలో దోపిడి దొంగలను పట్టుకోవాడానికి ప్రత్యేక పోలీస్ టీంలను ఏర్పాటు చేశారు.  నేరస్తులను పట్టుకుని వారిని బుధవారం రిమాండ్ కు పంపారు. నేరస్థులు అహ్మద్ జహీరాబాద్ లోని ఆనంద్ కిరాణా, జనరల్ స్టోర్ (ఐటీసీ డిస్ట్రిబ్యూటర్)లో డీసీఎం డ్రైవరుగా, నెలకు రూ. 16,500 జీతానికి పని చేస్తున్నాడు. అయితే ఆ జీతం డబ్బులు తన కుటుంబ పోషణకు సరిపోక పోవడంతో, ఈ పరిస్థితుల్లో నుండి ఎలాగైనా బయటపడాలనే ఉద్దేశ్యంతో, తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురాశతో ఈ పనికి పాల్పడ్డాడు. తనతోపాటు స్నేహితుడు మొహమ్మద్ అన్వర్ కి ఈ విషయం చెప్పగా ఒప్పుకున్నాడు.

వీరితో పాటు మీర్జా కాశీఫ్ తోపాటు  అందరూ  వారం రోజుల క్రితం జహీరాబాద్ రైల్వే స్టేషను దగ్గర ఉన్న ఈద్గా దగ్గర కలుసుకుని ప్లాన్ వేసుకున్నారు.  ఈ దోపిడి కోసం రెండు కట్టెలు, కారం పొడి, ఎవరైనా అడ్డొస్తే చంపేయడానికి వీలుగా ఒక కత్తిని సంచిలో తీసుకుని వచ్చినారు.  అక్కడ నుండి గ్లామర్ బండి, అపాచీ బండి, ఎఫ్‌జెడ్ బండి మీద అందరూ బోరంచ కమాన్ (టీ లింగంపల్లి) ఏరియా కి బయల్దేరారు. దొంగతనం తర్వాత కొద్ది దూరం తర్వాత రాయిపల్లి మంజీర డ్యామ్ లో రెండు సెల్ ఫోన్ లు, డి‌సి‌ఎం తాళాలు పడేసినారు. తరువాత అందరూ జహీరాబాద్ శివారులో మొత్తం దోచుకున్న డబ్బులు 7,46,411 లలో ఎవరి వాటా వాళ్ళు పంచుకొని ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.  ఉదయం పోలీసులు  రాయిపల్లి చౌరస్తా దగ్గర నిందితులను పట్టుకుని రూ.  దోచుకున్న 6,70,000 సొమ్ముని వారి దగ్గర నుండి రికవరీ చేసి, వారిని రిమాండ్  కి  పంపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని జిల్లా ఎస్.పి రోహిని ప్రియదర్శిని అభినందించారు.