నే..బుల్లెట్ బండెక్కి వచ్చెస్తపా..!!

నే..బుల్లెట్ బండెక్కి వచ్చెస్తపా..!!

 పండుగపూట పుట్టింట్లో సరదాగా గడిపిన యంపిమాలోత్ కవిత..

ముద్రప్రతినిధి‌,మహబూబాబాద్: నే..బుల్లెట్ బండికి వచ్చేస్తపా.. డుగ్..డుగ్ డుగ్ డుగ్ డుగ్గని అంటూ మహబూబాబాద్ యంపి, భారాస జిల్లాఅద్యక్షురాలు మాలోత్ కవిత బుల్లెట్ ఎక్కి బుదవారం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలో సందడి చేసారు. ఉగాది పర్వదినం సందర్భంగా తన పుట్టినిల్లయిన ఉగ్గంపల్లికి కుటుంబంతో సహావచ్చిన యంపి కవిత తన తండ్రి డోర్నకల్ ఎమ్మెల్యే డిఎస్ రెడ్యానాయక్, తల్లి లక్ష్మి  ఆశీస్సులు తీసుకుని ఉగాదిపూజకార్యక్రమాలలో పాల్గొన్నారు.

సాయంత్రం సరదాగా ఉగ్గంపల్లిలో తన మరదల్లు నిత్య,సుష్మ, సోదరుడు రాజేంద్రప్రసాద్, కుమారుడు నయన్, భారాస నాయకులు అయూబ్ లతో కలిసి తిరిగారు. గొర్రెలు,మేకల మందలతో కలిసి ఆడుకున్నారు. బుల్లెట్ బండిపై సరదాగా తన కుమారుడు నయన్ తో, మరదల్లతో కలిసి పోటోలు దిగారు. నిత్యం ప్రజాసమస్యలు,రాజకీయాలతో బిజీ.. బిజీగా గడిపే యంపికవిత పుట్టింట్లో పసిపిల్లలాగే మారిపోయింది. తల్లిగారి ఇల్లంటె ఏ..ఆడబిడ్డకయిన ఆనందాలలోగిలే...