మానుకోట హోళీసంబురాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ..

మానుకోట హోళీసంబురాలలో జిల్లా కలెక్టర్, ఎస్పీ..

ముద్రప్రతినిధి‌, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లా లో హోలీ వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా సాగాయి. జిల్లాకేంద్రంలో జరిగిన వేడుకలలో  జిల్లాకలెక్టర్ శశాంక, జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ లతోపాటు పలువురు అధికారులు పాల్గొని సందడి చేశారు. హోలీ వేడుకల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ప్రజలు రంగుల పండుగ జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందంగా ఉత్సాహంగా గడిపారు.  జిల్లా కేంద్రంలో జరిగిన హోలీవేడుకల్లో కలెక్టర్ శశాంకతో పాటు ఎస్పీ శరత్ చంద్రపవార్, అడిషనల్ కలెక్టర్ అభిలాషఅభినవ్, డిఎఫ్ఓ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. వారితోపాటు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొని రంగులు చల్లుకుంటూ  నృత్యాలు చేశారు