రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభం
రాజమండ్రిలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. ఫోటో ఎగ్జిబిషన్ స్టాళ్లను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. మహానాడులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేదికపై ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు, పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. లోకేష్ పార్టీ ప్రతినిధులకు అభివాదం చేస్తూ అందరినీ పలకరించారు. పార్టీ జెండాను చంద్రబాబు ఆవిష్కరించారు.