హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో నూతన 108,102 అంబులెన్సుల ప్రారంభం

హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో నూతన 108,102 అంబులెన్సుల ప్రారంభం

హన్మకొండ: హన్మకొండ కలెక్టర్ కార్యాలయంలో నూతన 108,102 అంబులెన్సులను ప్రారంభించిన ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు. ఈ సందర్భగా చీఫ్ విప్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత  ఒకవైపు సంక్షేమం మరొకవైపు అభివృద్ధితో పాటు ముందుకు సాగుతుందని అన్నారు  ప్రజలందరి సంక్షేమం కోసం అనేక వర్గాల అభ్యున్నతి కోసం, వారి ఆర్థిక ఎదుగుదల కోసం, అనేక పథకాల అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఆపదలో ఆదుకొని  వారిని సురక్షితంగా దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ లకు తరలించి, వారి ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యే వరకు సేవలందిస్తున్నటువంటి  108 ఉద్యోగస్తులకు ధన్యవాదములు తెలియజేశారు.పేద ప్రజలకు  వైద్య సేవలు అందించడంలో ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్, (బీఆర్ఎస్) ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, దానిలో భాగంగానే సేవలు శరవేగంగా అందించడానికే అంబులెన్స్లను అధికంగా మంజూరు చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సంగం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ గారు, కలెక్టర్ సిక్తా పట్నాయక్ గారు, మున్సిపల్ కమిషనర్ రిజ్వన్ భాష షేక్ గారు, వాద్య ఆరోగ్య విభాగం అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు..