తుంగతుర్తి నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లు

తుంగతుర్తి నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న రోడ్లు
  • 9 సంవత్సరాల పాలన అనంతరం అధికార పార్టీ వారికి గుర్తుకొచ్చిన రోడ్లు
  • ఇది ముమ్మాటికి ఎన్నికల జిమ్మీకే
  • రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యం

తుంగతుర్తి ముద్ర: తుంగతుర్తి నియోజకవర్గం అభివృద్ధి జరిగింది అంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బి ఆర్ ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన అభివృద్ధి శూన్యమని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తిరుమల ప్రగడ అనురాధ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పాలకుర్తి రాజయ్యలు అన్నారు .శుక్రవారం వారు ముద్రతో మాట్లాడుతూ గడచిన తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలో ఏ ఒక్క రోడ్డును మరమ్మతు చేయని అధికార పార్టీ వారికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ రోడ్లు ఎందుకు గుర్తుకు వచ్చాయో ప్రజలు అర్థం చేసుకుంటారని అన్నారు. ఎన్నికల కోసం కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెబుతున్నారని ఇప్పటిదాకా రోడ్లను ఎందుకు నిర్మాణం చేయలేదని వారు ప్రశ్నించారు .తుంగతుర్తి వయా వెంపటి మీదుగా జలాల్పురం రోడ్డు, అన్నారం -తుంగతుర్తి రోడ్డు ,పస్తాల -గుండెపురి రోడ్డు ,బండ రామారం వయా గుండెపురి వెలిశాల రోడ్డు ,కొత్తగూడెం -గోరింటా రోడ్డు ,గానుగ బండ తూర్పు గూడెం రోడ్డు లు  గుంతల మయంగా మారి ప్రజలకు నరకం చూపిస్తున్నాయని వారన్నారు .

తొమ్మిది సంవత్సరాలుగా ఒక్కసారి కూడా రోడ్ల మరమ్మత్తు చేయలేదంటే టిఆర్ఎస్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు .ఎన్నికల ముందు అధికార పార్టీ వారు చేసే జిమ్మిక్కుగాప్రజలు గమనిస్తున్నారని అధికార పార్టీ వారు చేసే ఎత్తుగడలను ప్రజలు నమ్మరని వారన్నారు. పనులకు నిధులు ఇప్పుడు మంజూరు అయితే పనులు ప్రారంభమయ్యేసరికి ఎన్నికల కోడ్ వస్తుందని తిరిగి ఎన్నికల తర్వాత పనిచేస్తామని చెప్పడానికే అధికార పార్టీ వారు నిధుల మంజూరి ఎత్తుగడతో వచ్చారని అన్నారు  .కాంగ్రెస్ పార్టీ హయాంలో వేసిన రోడ్లు అలానే ఉన్నాయని కనీసం వాటి విస్తరణ కూడా ప్రయత్నం చేయలేదని అన్నారు .రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తాము నియోజకవర్గంలోని అన్ని రోడ్లను పునర్నిర్మాణం చేస్తామని అన్నారు .వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడం ఖాయమని కాంగ్రెస్ జెండా రెపరెప లాడుతుందని వారన్నారు.