నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్: సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్

నెంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్: సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ రవీందర్

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: వాహనాల నెంబర్‌ ప్లేట్లు సరిగా లేని వాహనదారులపై చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్సై రవీందర్  హెచ్చరించారు. ఆదివారం  సూర్యాపేట పట్టణంలో వాహనాల తనిఖీ చేపట్టి వాహనదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్టాడుతూ కొందరు వాహనదారులు వాహనాల నెంబ ర్లు ట్యాంపరింగ్‌ చేస్తున్నారన్నారు. అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. నెంబర్‌ ప్లేట్లు ట్రాఫిక్‌ నిబంధనల ప్రకారం ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత వాహనదారులపైన ఉందన్నారు. నెంబర్ ప్లేట్ లేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.ఈ  కార్యక్రమంలో ట్రాఫిక్  సిబ్బంది పాల్గొన్నారు.