ఇంటర్ మొదటి సంవత్సరం లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి సూర్యాపేట జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆర్థిక సాయన్ని అందజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా D.C.M.S చైర్మన్

ఇంటర్ మొదటి సంవత్సరం లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి సూర్యాపేట జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఆర్థిక సాయన్ని అందజేసిన ఉమ్మడి నల్గొండ జిల్లా D.C.M.S చైర్మన్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ జిల్లా D.C.M.S చైర్మన్ వట్టె జానయ్య యాదవ్ సహకారంతో నల్గొండ జిల్లా కేంద్రంలోని గౌతమి IIT &NEET ACADEMI MPC ఇంటర్ మొదటి సంవత్సరం లో 470/468 స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన గునుగుంట్ల నమ్రత యాదవ్ కి పై చదువుల కోసం సూర్యాపేట జిల్లా యాదవ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో సుమారు ₹50,000 (యాభై వేల) ఆర్థిక సాయన్ని అందజేసి సన్మానించిన ఉమ్మడి నల్గొండ జిల్లా D.C.M.S చైర్మన్  వట్టె జానయ్య యాదవ్ ఆదివారం  మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం లో స్టేట్ మొదటి ర్యాంక్ సాధించిన గునుగుంట్ల నమ్రత యాదవ్ కి ఎల్లప్పుడు తన సహకారం ఉంటుందని అన్నారు. ఆమెకి  ఆర్థికంగా అన్నివిధాలుగా ఆదుకుంటామని అన్నారు.నమ్రత యాదవ్ ఇంకా పై చదువులు చదవాలని మంచి స్థాయిలో ఉండాలని,యువతకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమం లో సూర్యాపేట జిల్లా యాదవ విద్యావంతుల వేదిక సభ్యులు నూకల నాగరాజు యాదవ్ , జటంగి వీరాస్వామి యాదవ్ , శీల యాదగిరి యాదవ్ , శ్రీనివాస్ యాదవ్ ,కంచుగట్ల శ్రీనివాస్ యాదవ్ ,బొల్లం మల్లేష్ యాదవ్ ,ఆవుదొడ్డి శ్రీకాంత్ యాదవ్ ,పెన్ పహాడ్ మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆవుల అంజయ్య యాదవ్ ,తదితరులు పాల్గొన్నారు.