తమ డిమాండ్లు అమలు చేయాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన పాఠశాల స్వీపర్ల సంఘం

తమ డిమాండ్లు అమలు చేయాలంటూ మంత్రి జగదీష్ రెడ్డి కి వినతి పత్రం అందజేసిన పాఠశాల స్వీపర్ల సంఘం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: జిల్లా కేంద్రంలోని పద్మశాలి భవన్ లో జిల్లా స్కూల్ స్వీపర్ల సంఘం   ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ని కలిసి తమ న్యాయబద్ధమైన డిమాండ్లను అమలు చేయాలంటూ పాఠశాల స్వీపర్ల సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  స్కూల్ స్వీపర్ల కనీస వేతనం 27,000 అందజేయాలని, ఇప్పటివరకు ఉన్న పాత బకాయిలు సుమారు రెండు లక్షల 33112 రూపాయలు వెంటనే విడుదల చేయాలని, 61 సంవత్సరాలు నిండిన వారికి జీవో నెంబర్ 45 ప్రకారం 15 లక్షలు రిటర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలని, నెలకు 10,000 పెన్షన్ అందజేయాలని డిమాండ్ చేశారు. అన్ని పాఠశాలలో స్వీపర్లకు నియామకం చేపట్టాలని సర్వీస్ లో ఉండి చనిపోయిన వారి కుటుంబాలను ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, విద్యార్హత అనుగుణంగా పదోన్నతి కల్పించాలని, ప్రభుత్వం జాప్యం చేయడం ఏమాత్రం తగదని వారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్వీపర్ల సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేయాలనిఅన్నారు. మంత్రి స్పందించి మా సమస్యలను  ముఖ్యమంత్రి కెసిఆర్  దృష్టి కి తీసుకెళ్లి మా సమస్యలని పరిష్కారించాలని మంత్రి కోరామన్నాం ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నార్ల పరుశురాం,ఉపాధ్యక్షులు నెమ్మాది నాగేశ్వరరావు, కార్యదర్శి రసూల్, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్.జానకి, కార్యవర్గ సభ్యులు పి,రమేష్, ఎస్ కే, జానీ ,మదార్, వెంకటేశ్వర్లు,మరియమ్మ ,కోటమ్మ, లింగమ్మ, లచ్చిరాం నాయక్,తావూరియా, పాల్గొన్నారు.