సూర్యాపేట పురపాలికకు రాష్ట్ర స్థాయి పురస్కారం

సూర్యాపేట పురపాలికకు రాష్ట్ర స్థాయి పురస్కారం
  • మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ నిర్మాణాలకు
  • తొమ్మిది ఏళ్లలో సూర్యపేటకు ఐదో పురస్కారం
  • మూడు జాతీయ స్థాయిలో, రెండు రాష్ట్ర స్థాయిలో
  • పబ్లిక్ హెల్త్ వర్కర్లకు పురస్కారాలు
  • కరోనా సమయంలో అందించిన సేవకు మహిళ వర్కర్ కు జాతీయ స్థాయిలో పురస్కారం
  • తాజాగా శానిటేషన్ లో పబ్లిక్ హెల్త్ వర్కర్ కు పురస్కారం
  • ఇద్దరు మహిళలే
  • రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా 5,000 నగదు,బట్టలతో సత్కారం
  • పట్టణ ప్రగతి దినోత్సవం రోజున అందిన శుభావార్త
  • శుక్రవారం రోజున మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అవార్డు అందుకొనున్న చైర్మన్,కమిషనర్లు
  • మంత్రి జగదీష్ రెడ్డి మార్క్ కు పురస్కారాల వెల్లువ

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట: మంత్రి జగదీష్ రెడ్డి ఇలాఖాకు రాష్ట్ర స్థాయిలో మరో పురస్కారం లభించింది. సూర్యాపేట పురపాలక సంఘం పరిధిలో నూతనంగా నిర్మించిన మహాప్రస్థానం, ఇంటిగ్రేటెడ్ వెజ్&నాన్ వెజ్ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్దిఉత్సవాలలో బాగంగా జరుగుతున్న పట్టణ ప్రగతి సంబరాలకు కొద్దీ గంటల ముందు వెలువడిన ఈ ప్రకటనతో సూర్యాపేటలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.

శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పట్టణ ప్రగతి సంబరాలలో రాష్ట్ర ఐటి  పురపాలక శాఖామంత్రి కలువకుంట్ల తారక రామారావు చేతుల మీదుగా సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ పెరిమాండ్ల అన్నపూర్ణమ్మ, కమిషనర్ రామంజుల్ రెడ్డి ఈ అవార్డ్ ను అందుకోబోతున్నారు.అంతే కాదు శానిటేషన్ లోనూ సూర్యాపేట పబ్లిక్ హెల్త్ లో పని చేస్తున్న ఉద్యోగిని నకిరేకంటి సువార్తకు రాష్ట్ర స్థాయిలో సత్కారం చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

శానిటేషన్ లో శ్రద్ద చూపించడం తో పాటు క్రమం తప్పకుండా విధులకు హాజరు కావడం,ఆమె ట్రాక్ లో గైర్ హాజరు కాకపోవడంతో ఆమెను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.5,000 నగదు తో పాటు నూతన వస్త్రాలతో మంత్రి కేటీఆర్ ఆమెను సత్కరిస్తారురు. కరోనా సమయంలోనూ అత్యుత్తమ సేవలు అందించినందుకు గాను అదే పబ్లిక్ హెల్త్ ఉద్యోగిని మెరుగ మారుతమ్మకు జాతీయ స్థాయిలో పురస్కారం లభించిన విషయం విదితమే.గడిచిన తొమ్మేదెళ్ల వ్యవధిలో సూర్యాపేట పురపాలికకు మూడు జాతీయ స్థాయిలో,రెండు రాష్ట్ర స్థాయిలో అవార్డులు రావడం మంత్రి జగదీష్ రెడ్డి పాలనా మార్క్ కనిపిస్తుంది.

మంత్రి జగదీష్ రెడ్డి అధికారంలోకి రాగానే దత్తత తీసుకున్న ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూర్ గ్రామానికి జాతీయ స్థాయిలో అవార్డ్ లభించడం ఇందుకు తార్కాణం.జాతీయ స్థాయిలో సూర్యాపేట పురపాలక సంఘానికి శానిటేషన్, స్వచ్ఛత లకు ఒక అవార్డ్,స్వచ్ఛత కు మరో అవార్డ్ లభించగా పర్యావరణం పరిరక్షణ లో రాష్ట్ర స్థాయిలో అవార్డు దక్కింది. ఇప్పుడు తాజాగా సూర్యపేట పట్టణంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ వెజ్& నాన్ వెజ్ మార్కెట్ తో పాటు మహాప్రస్థానం నిర్మాణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డ్ ప్రకటించింది.