పోస్టాఫీసు లలో టాటా మరియు బజాజ్ వారి ప్రమాద బీమా మంచి లాభదాయక మైన స్కీమ్స్

పోస్టాఫీసు లలో టాటా మరియు బజాజ్ వారి ప్రమాద బీమా మంచి లాభదాయక మైన స్కీమ్స్

మద్దిరాల  ముద్ర:- పోస్టాఫీసలలో టాటా మరియు బజాజ్ వారి ప్రమాదబీమా మంచి లాభదాయకం అని పోస్టల్ సూపరిండెంట్ వడ్లమూడి వెంకటేశ్వర్లు అన్నారు. మండల పరిధిలో రెడ్డిగూడెం గ్రామానికి చెందిన బెడద సతీష్  పోస్టాఫీస్ లో ఇండియా పోస్ట్ పేమెంట్ ద్వారా 399 రూపాయల ఇన్సూరేన్స్ చేసి ప్రమాద వశాత్తు మరణించారు. బెడిద సతీష్ భార్య అయిన శ్రీలత కు  పది లక్షల రూపాయల  చెక్కు అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  పోస్ట్ ఆఫీస్ లో వివిధ  స్కీమ్ ల ద్వారా నిరు పేదలకు ఎంతో మేలు జరుగుతుంది అన్నారు. పోస్టల్ స్కీం ల గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ ఇన్స్పెక్టర్ గౌని సురేష్ , ఐపిబి చీఫ్ మేనేజర్ భాస్కర నాయక్ గారు ,IPPB branch సీనియర్  మేనేజర్ B.శ్రీ కళ్యాణ్,పోస్టల్ సిబ్బంది సబ్ పోస్ట్ మాస్టర్ ఎం మురళీకృష్ణ , మెయిల్ over-seer కే అంజనేయులు  మరియు రెడ్డిగూడెం గ్రామ పోస్ట్మాస్టర్ పులి గౌతమ్ BPM లు,ABPM లు మరియు గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.