దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీస్

దొంగలను అరెస్ట్ చేసిన సూర్యాపేట పట్టణ పోలీస్
  • 10 లక్షల విలువగల ఆభరణాలు సీజ్
  • ఇద్దరు దొంగల అరెస్ట్, రిమాండ్
  • 6 కేసులు గుర్తింపు
  • జిల్లా పోలీసు కార్యాలయం నందు మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్
  • సొత్తు రికవరీ, నిందితుల పట్టుబడిలో బాగా పని చేసిన సిబ్బందిని అభినందించి రివార్డ్ అందించిన ఎస్పీ 
ముద్ర ప్రతినిధి, సూర్యాపేట :పింగిలి రఘువరన్ రెడ్డి  సం., కులం: రెడ్డి, వృత్తి; మేడ్చల్ జిల్లా మేడిపల్లి గ్రామం ముత్తవల్లిగూడ గ్రామానికి చెందిన డ్రైవరు పింగిలి రఘువరన్ రెడ్డి ,తిరుపతి జిల్లా తిరుచానూరు అలివేలు కాలనీ చెందిన  కారు డ్రైవరు బ్రహ్మదేవర రాజశ్రీ లను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. దొంగల నుండి 16 తులాల బంగారు ఆభరణాలు

ఒక R-15 మోటార్ సైకిల్ ఒక హీరో హోండా CBZ మోటార్ సైకిల్ AP 03 AW 0693 స్వాధీనం చేసుకుందామని ఎస్పీ వివరించారు వీరిపై ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో పలు జిల్లాల్లో పాత కేసులు నమోదయి ఉన్నాయని చెప్పారు. పాత కేసుల్లో శిక్షలు పడగా మీరు ఇరువురు చర్లపల్లి జైల్లో పరిచయం అయిందని తదుపరి రాత్రిపూట తాళం వేసి ఉన్న ఇండ్లను గమనించి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనం చేస్తారని ఎస్పీ వివరించారు బుధవారం ఉదయం ఐదు గంటలకు పెట్రోలింగ్ చేస్తుండగా సూర్యాపేట హైటెక్ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా సూర్యాపేట పట్టణ సీఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఎస్సైలు శ్రీనివాస్ యాకూబ్ సతీష్ వర్మ ఐడి పార్టీ కరుణాకర్ కృష్ణ సైదులు మధు ఆనందులు చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారని ముద్దాయిలను రిమాండ్ కు తరలించడం జరిగిందని తెలిపారు
మొత్తం 10 లక్షల రూపాయల  విలువైన సొత్తు గల కేసులను ఛేదించటంలో చాకచక్యత ప్రదర్శించిన  సూర్యాపేట పట్టణ Inspector జి. రాజశేఖర్, SI లు జి. సతీష్ వర్మ, యస్. కె. యాకూబ్, హెడ్ కానిస్టేబుల్ లు కరుణాకర్, కృష్ణ, కానిస్టేబుళ్లు  సైదులు, ఆనంద్, మధు లను సూర్యాపేట DSP పి. నాగభూషణం, సూర్యాపేట జిల్లా SP S. రాజేంద్రప్రసాద్  ఈ సందర్భంగా అభినందించడం జరిగినది. ఇట్టి కేసులను ఛేదించిన సిబ్బందికి SP  రివార్డ్స్ ప్రకటించినారు.