ఉపాధ్యాయ ఉద్యమ కార్యాచరణ కరపత్రం ఆవిష్కరణ -  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

ఉపాధ్యాయ ఉద్యమ కార్యాచరణ కరపత్రం ఆవిష్కరణ -  తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-రాష్ట్రం లోని పాఠశాల విద్యాశాఖ లో దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉపాద్యాయ , విద్యారంగ సమస్యలు పరిష్కారం కొరకు టిపియూఎస్ ఆధ్వర్యంలో దశలవారీ ఉద్యమ కార్యాచరణ ను రూపొందిస్తూ ఆదివారం స్థానిక సిద్దార్థ ఉన్నత పాఠశాల లో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యమ జాగరణ కరపత్రం ఆవిష్కరించనైనది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పర్వతం సంధ్యారాణి, యామా రమేశ్ లు మాట్లాడుతూ న్యాయపరమైన చిక్కులు తొలగిస్తూ బదిలీలు, పదోన్నతులు వెంటనే చేపట్టాలని, నూతన పి ఆర్ సీ కమిటీ ని నియమిస్తూ ఐ ఆర్ తక్షణమే ప్రకటించాలని,         పెండింగ్ బిల్లులన్నింటినీ వెంటనే చెల్లించాలని సీ పి యస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, కే జీ బీ వీ ఉపాధ్యాయినిలను అందరినీ రెగ్యులరైజ్ చేయాలని, ఆదర్శ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాద్యాయులకు 010 కింద జీతాలు చెల్లించాలని, గురుకులాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ హెల్త్ కార్డులు ఇవ్వాలని రాష్ఠ్ర ప్రభుత్వాన్ని కోరారు.

ఉద్యమ జాగరణ లో భాగంగా ఈ నెల 18 నుండి వచ్చేనెల 19 వరకు దశలవారీ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో  హరిప్రసాద్, శ్రీనివాస్, తిరుమలేశ్, దేవరాజు, పరంజ్యోతి , శ్రీనివాస రావు , శ్రీనివాసాచారి, సాయికుమార్ , ముత్త య్య, గోవర్ధన్, లలితకుమారి,సువర్ణ లక్ష్మి, శ్రీదేవి , రేణుక , కళావతి, శ్రీనివాసరెడ్డి, శ్రీధర్, సురేశ్, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి, సుధాకర్ రావు, నవీన్ , కిరణ్ దేశ్ పాండే, కృష్ణమూర్తి, కోటిరెడ్డి తదితర తపస్ బాధ్యులు పాల్గొన్నారు.