CPS విధానాన్ని రద్దు చేయాలి-డిటిఎఫ్.  

CPS విధానాన్ని రద్దు చేయాలి-డిటిఎఫ్.  
  • CPS విధానాన్ని రద్దు చేయాలి-డిటిఎఫ్.  

మద్దిరాల ముద్ర:-CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు.2003 డి ఎస్ సి  వారికి తక్షణమే పాత పెన్షన్ ను అమలు చేయాలి అన్నారు.మద్దిరాల మండల కమిటీ ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వ క్యాంపెన్ లో పాల్గొని ఆయన మాట్లాడుతూ జులై 1 తో పదవ పీఆర్సీ గడువు పూర్తి అయినందున పీఆర్సీ కొరకు కమిటీని నియమించాలి అన్నారు.రిపోర్ట్ వచ్చేవరకు 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలి అన్నారు.డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు రేపాక లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నూతనకల్ మండల శాఖ ఆధ్వర్యంలో డిటిఎఫ్ సభత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించి జి.ప.ఉన్నత పాఠశాల పిలుమళ్లలో రాష్ట్ర మహాసభల ఆహ్వాన పత్రాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు.మహాసభలకు సహకరించాలని ఉపాధ్యాయులను అభ్యర్థించారు.కోర్ట్ స్టేను వెకేట్ చేపించి ఉపాధ్యాయ బదిలీలు,ప్రమోషన్లు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు.  పాఠశాలలలో పారిశుధ్య కార్మికుల నియామకం చేయాలి అన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన గౌరవ వేతనం వెంటనే అందజేయాలి అన్నారు.ప్రతి మండలానికి ఒక MEO ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి అన్నారు.అన్ని రకాల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు ,బి.క్రాంతికుమార్,GHM బి.వెంకటయ్య,మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.రాములు,బి.దేవేందర్సీ నియర్ సభ్యులు పి.రవీందర్ రెడ్డి జె.అబ్రహం,ఆర్.సుధాకర్, ,,,సాహెబ్ అలీ వి.సైదులు, వీరంజనేయులు,జి.వెంకటేశ్వర్లు,శ్రీలత,సైదులు, వెంకన్న,అంజలి,వెంకటేశ్వర్లు,పూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు