ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ... ధైర్యంగా ముందుకు సాగగా

ప్రభుత్వ కొలువే లక్ష్యంగా ... ధైర్యంగా ముందుకు సాగగా
  • పట్టు విడువక - పరుగు ఆపక
  • చదువుకు పునాది గ్రామమైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం సంగ్రామం
  • సాఫ్ట్వేర్ గా పనిచేసినా సోదరి స్ఫూర్తితో అకుంఠిత దీక్ష శ్రమ మొక్కవోని ధైర్యంతో లక్ష్యసాధన
  • అక్కా చెల్లెలు ఇద్దరు డిపార్ట్మెంట్లోనే
  • ఈ విజయం అమ్మానాన్నలకు అంకితం 
  • తప్పకుండా గ్రూప్స్ కొడతా:  సివిల్ ఎస్ ఐ  ప్రియాంక


ముద్ర ప్రతినిధి  కోదాడ :-అవనిలో సగం ఆకాశంలో సగం అవకాశాల్లో సగం అంటూ పురుషులతోపాటు అన్ని రంగాల్లో దూసుకుపోతున్న మహిళలు తాము అబ లల్లు కాదని సభలమే అని ఆడపిల్లలు ఒకనాడు కన్న వాళ్లకు భారం నేడు మాత్రం తమ లక్ష్యసాధన కోసం కటోరంగ శ్రమించి గోల్ చేరుకొని అమ్మానాన్నల జీవితాల్లో వెలుగులు నింపిన అక్కాచెల్లెళ్ల వాస్తవ గాధ ఇది. 

కోదాడ నియోజకవర్గం లోని చిలుకూరు మండలం , జెర్రిపోతులగూడెం గ్రామంలో పందిరి. అమృత రెడ్డి - లక్ష్మి ల రెండవ కుమార్తె ప్రియాంక.ఒకటి నుండి అయిదవ తరగతి వరకు గ్రామంలోని ఒక ప్రయివేట్ పాఠశాల లో , ఆరు నుండి పదవ తరగతి వరకు జెడ్ పి ఎచ్ ఎస్ జెర్రిపోతులగూడెం పాఠశాలలో , ఇంటర్మీడియట్ కోదాడ లోని సుగుణ జూనియర్ కళాశాలలో , ఇంజనీరింగ్ అనురాగ్ కళాశాల కోదాడ లో , పీజీ హైదరాబాద్ లోని హశ్విత ఇంజనీరింగ్ కాలేజీలో పూర్తి చేసి ఆ తర్వాత సాఫ్ట్ వేర్ ఉద్యోగినిగా కొన్నాళ్ళు పని చేసిన ప్రియాంక , ప్రభుత్వ ఉద్యోగం కొట్టాలి అన్న లక్ష్యంతో ముందుకు సాగింది . ఆదివారం వెలువడిన ఎస్సై ఫలితాలలో సివిల్ ఎస్సై గ ఉద్యోగం సాధించింది . మొదటి నుండి తల్లితండ్రులు వ్యవసాయ కుటుంబం అయినా కానీ చదువు విషయంలో పిల్లలను ప్రోత్సహించేవారని , తన అక్క తేజస్విని జైల్ వార్డర్ గా జాబ్ కొట్టడంతో అదే స్పూర్తితో తానూ కూడా పోలీస్ డిపార్టుమెంట్ లో ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో కష్టపడి చదివానని , ఈవెంట్స్ కోసం కేవలం నెల రోజులు మాత్రమే కష్టపడ్డానని ఎస్సై జాబ్ సాధించిన ప్రియాంక గుర్తు చేసుకున్నది . ఎలాగైనా గ్రూప్స్ కొట్టడమే తన లక్ష్యమని , ఖచ్చితంగా గ్రూప్స్ కొడతానని ఆశాభావం వ్యక్తం చేసింది .