నిరాడంబరంగా కొలువుదీరిన ఏడుపాయల పాలకవర్గం

నిరాడంబరంగా కొలువుదీరిన ఏడుపాయల పాలకవర్గం
  • చైర్మన్ గా రెండవసారి బాలాగౌడ్

ముద్ర ప్రతినిధి, మెదక్:తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వన దుర్గ మాత ఆలయానికి నూతన పాలకవర్గం నిరాడంబరంగా కొలువుదీరింది.  ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచన మేరకు తిరిగి పాత పాలకవర్గాన్నే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

పాలకవర్గం సభ్యులుగా సాతెల్ల బాలాగౌడ్, బుసనెల్ల మానెమ్మ, నీరుడి సిద్దిరాములు, ఉప్పరి వెంకటేశం, దొడ్ల మనోహర్, పోతుగంటి రఘువీర్, మరుమూల నాగభూషణం, అంబిర్ మోహన్ రావు, నాయికోటి సాయిలు, ఉప్పరి పెంటయ్య, రాగి చక్ర పాణి, కొమ్ముల యాదాగౌడ్, రాజ్పేట బాగారెడ్డి, కాశమొల్ల శ్రీనివాస్, సీనియర్ పంకర శర్మ (ఎక్స్ అఫీషియో సభ్యులు)లు ఉన్నారు. వీరు దేవాలయంలో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. రెండవసారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గా సాతెల్లి బాలాగౌడ్ బాధ్యతలు స్వీకరించారు.