కుటుంబం కోసం ట్రాఫిక్ నియమాలు పాటించండి

కుటుంబం కోసం ట్రాఫిక్ నియమాలు పాటించండి

హెల్మెట్ పంపిణీ చేసిన  ఎస్.పి రోహిణి ప్రియదర్శిని                                                                                                                          
ముద్ర ప్రతినిధి, మెదక్: మీ రక్షణ, కుటుంబ పరిరక్షణకై వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని సూచించారు. 
ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ను ధరించాలన్నారు. బుధవారం అల్లాదుర్గ్ పోలీస్ స్టేషన్ పరిది 161వ జాతీయ రహదారి  కోలపల్లి టోల్ ప్లాజా వద్ద క్యూబ్ హైవేస్ క్యూబ్ రూట్స్ ఫౌండేషన్  ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత హెల్మెట్ పంపిణీ కార్యాక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ద్విచక్ర వాహన ప్రయాణంలో హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేస్తూ యాక్సిడెంట్ అంటే ఓ బైకో, కారో రోడ్డు మీద పడటం కాదు ఓ కుటుంబం రోడ్డున పడటం అని అన్నారు. ప్రజలు తమ ప్రాణాలనే కాకుండా తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులను దృష్టిలో వుంచుకొని వాహనాలను నడపాలని, అభం శుభం తెలియని తమ పిల్లలకు తీరని వ్యధను మిగల్చవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లాదుర్గ్ సి.ఐ జార్జ్, అల్లాదుర్గ్ ఎస్.ఐ ప్రవీణ్, టెక్మాల్ ఎస్.ఐ.ఓ.డి.రమేశ్, పెద్ద శంకరంపేట్ ఎస్.ఐ.బాల్ రాజు, ఆర్ఈ విజయరాజు, ప్రాజెక్ట్ హెడ్ ప్రభాకర్ రెడ్డి, ఐఎంఎస్ మేనేజర్ కాజా మొయినుద్దీన్, శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎస్.పి. పి.రోహిణి ప్రియదర్శిని రేగోడ్  పోలీస్ స్టేషన్ తనిఖీ చేశారు.