మీడియ రక్షణ చట్టం, కమిషన్​ ఏర్పాటు చేయాలి

మీడియ రక్షణ చట్టం, కమిషన్​ ఏర్పాటు చేయాలి
  • గాంధీ, కలెక్టరేట్ ముందు జర్నలిస్టుల డిమాండ్
  • కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపుమేరకు సోమవారం టీ యూడబ్ల్యూజె ఆధ్వర్యంలో మెదక్ గాంధీ విగ్రహం ముందు, అనంతరం కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం మెదక్ కలెక్టర్ రాజర్షి షాకు ఈ క్రింది డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు ఎ. శంకర్ దయాళ్ చారి మాట్లాడుతూ... దేశంలో మీడియా,  మీడియా వ్యక్తుల కోసం రక్షణ చట్టాన్ని అమలు చేయాలని, దేశంలోని భిన్నమైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులతో మీడియా కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, అక్రిడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్ లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశంలో మీడియా రంగం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచార విస్పోటనం జరుగుతోన్న ప్రస్తుత తరుణంలో ఈ రంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దేశ స్వాతంత్య్రానికి ముందు తర్వాత కూడా మీడియా అణిచివేత పరంపర కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతతో పాటు సంక్షేమం అందించాల్సిన బాద్యత పాలకులపై ఉందన్నారు.  మీడియా స్వేచ్చ అంటే యాజమాన్యాల స్వేచ్చ కాకుండా జర్నలిస్టులకు స్వేచ్చ కావాలన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజె శ్రీనివాస్ శర్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ.సంతోష్ కుమార్, రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యులు శ్రీనివాస్ మిన్ పూర్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు బి.నాగరాజు,  వెలుగు జిల్లా ప్రతినిధి శ్రీధర్, అశోక్, వార్త జిల్లా ప్రతినిధి వెంకటేష్ గౌడ్, ప్రజాపక్షం జిల్లా ప్రతినిధి సిద్దేశం, విధాత జిల్లా ప్రతినిధి కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి వి. దేవరాజ్, రామాయంపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మల్లేశం, జిల్లా నాయకులు ఎస్. రాజశేఖర్, బోనగిరి చంద్రశేఖర్, మోహన్ రాజ్, వెంకట్ గౌడ్, ఫారుక్ హుస్సేన్, ఆంజనేయులు గౌడ్, మురళీధర్, సుమన్, శివచరణ్ సింగ్, సందీప్, సత్యనారాయణ,  బాలకిషన్, ప్రసాద్, మల్లేశం, చంద్రశేఖర్ గౌడ్, చల్లా రాహుల్, అల్లాడి శేఖర్, గోవర్ధన్ రెడ్డి, రాజుతో పాటు పలువురు జర్నలిస్టు పాల్గొన్నారు.