మెదక్ లో బిఆర్ఎస్ భారీ ర్యాలీ

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ నియోజకవర్గం బిఆర్ఎస్ ప్రతినిధుల సభ సందర్భంగా మెదక్ పట్టణంలో మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. సాయి బాలాజీ గార్డెన్ నుండి నిర్వహించిన బైక్ ర్యాలీని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రారంభించారు. కార్యకర్తలతో పాటు ఆమె బైక్ నడిపి ఉత్తేజపరిచారు. ర్యాలీ వెల్కమ్ బోర్డు, ఆటోనగర్, పాత బస్టాండు, రాందాస్ చౌరస్తా, చిల్డ్రన్స్ పార్క్, పోలీస్ స్టేషన్, పోస్ట్ ఆఫీస్, అంబేద్కర్ సర్కిల్, న్యూ బస్టాండ్ మీదుగా చర్చి ప్రాంగణం నుండి వెస్లీ గోల్ బంగ్లా వరకు నిర్వహించారు. కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీలో ముందుకు సాగిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిని పట్టణంలో అడుగడుగునా నీరాజనం పలికారు  మైనార్టీల ఆధ్వర్యంలో పాత బస్టాండ్ వద్ద పూలమాలలు, శాలలతో సత్కరించిస్వాగతం పలికారు. రాందాస్ చౌరస్తాలో యువనాయకులు తొడుపునూరి శివరామకృష్ణ ఆధ్వర్యంలో భారీ గజమాలను వేసి ఘన స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్లు చంద్రపాల్, జితేందర్ గౌడ్, ఏఎంసీ చైర్మన్లు బట్టి జగపతి, సరాఫ్ యాదగిరి, వెంకటరామిరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, ఆత్మ అధ్యక్షులు అంజాగౌడ్,  ఉపాధ్యక్షులు పురం వెంకటనారాయణ, ఏఎంసీ డైరెక్టర్ శంకర్, కౌన్సిలర్లు రాగి వనజ సులోచన, నాయకులు అశోక్, కొండ శ్రీనివాస్, ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు, ఎంపీటీసీలు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, యువకులు, పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు.