పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు

పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు
  • మెదక్ కలెక్టర్ రాజర్షి షా

ముద్ర ప్రతినిధి, మెదక్:పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాజర్షి షా పేర్కొన్నారు. బుదవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలోసమావేశం ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సాధారణ పరిశీలకులు  పృధ్వీ రాజ్ బీపీ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సదర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... 30న పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్లను  కేటాయించారు.మైక్రో అబ్జర్వర్స్ లు పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రాల్లో   ర్యాంప్, త్రాగు నీరు, విద్యుత్, టయిలెట్స్ లాంటి సదుపాయాలు, పోలింగ్ నిర్వహణ , ఈవీఎం,  పోలింగ్ ఏజెంట్  ల నియామకం, ఇంక్ , ఫామ్- 17 నిర్వహణ జాగ్రతగా పరిశీలించాలని సూచించారు. సాధారణ పరిశీలకుడు పృధ్వీరాజ్ బీపీ మాట్లాడుతూ..పోస్టల్ బ్యాలెట్, మాక్ పోలింగ్, ఇoటి నుంచి ఓటు వేయడం, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సంఘటనలకు చోటు లేకుండా చూడాలని, ఎన్నిక  ముoదు ఎన్నికల అనంతరం మైక్రో అబ్జర్వర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పోలింగ్ రోజు చేయాల్సిన విధుల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు, తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.