కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ కష్టాలే

కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్ళీ కష్టాలే
  • మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంగ్రెస్ కి ఓటేస్తే మళ్ళీ కష్టాల పాలవుతామని, 11 సార్లు  అధికారంలో ఉండి చేసిందేమి లేదని మెదక్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. శనివారం మెదక్ మండల  రాయన్ పల్లి, శివాయపల్లి, కొంటూర్ తదితర గ్రామాలు  ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు ఏ పథకాన్ని ప్రవేశపెట్టాలన్న ఢిల్లీలో ఉన్న అధిష్టానం నిర్ణయించాల్సి ఉంటుందని, బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే మన అందరి నిర్ణయం మేరకే ముఖ్యమంత్రి కేసీఆర్  సంక్షేమ పథకాలను ప్రవేశపెడతారన్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అసైన్ భూములు  అమ్మకం, కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తుందని చెప్పారు. రైతు సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం  రైతుబంధును రూ.5000 నుంచి రూ.8000లకు పెంచనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మెదక్ నియోజకవర్గం  ఓ ప్రయోగశాలగా మారిందని, పార్టీ సభ్యత్వం లేని వారికి టికెట్ ఇస్తుందని ఆరోపించారు.

మైనంపల్లి హనుమంతు రావు కొట్లాటలు పెట్టడం మల్కాజ్ గిరిలో నడుస్తది కానీ మెదక్ నియోజకవర్గంలో కుదరదన్నారు. నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.మేము వచ్చి గొడవలు పెడతాం, కోట్లటలు  పెడతాం అంటే  ఊరుకోమని హెచ్చరించారు.  20 ఏళ్ల నుండి  మెదక్ ప్రజలతో  నాకు అనుబంధం ఉందని, తాను ఎమ్మెల్యే అయినప్పటికిని  ఎవరినీ ఇబ్బంది, నారాజ్ చేయలేదన్నారు. మెదక్ అభివృద్ధి పరంపర కొనసాగాలంటే అందరూ నన్ను ఆశీర్వాదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, ఎంపీపీ జమున జయరాం రెడ్డి, హవెలిఘన్పూర్ మెదక్ మండలాల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, అంజా గౌడ్, కౌన్సిలర్ మామిళ్ళ ఆంజనేయులు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, నాయకులు మాణిక్య రెడ్డి, కిష్టయ్య, సాయిలు, సరోజ తదితరులు పాల్గొన్నారు. డప్పుల చప్పులు... మహిళల మంగళారతులు... గిరిజనుల సంప్రదాయ నృత్యాలు.. బిఆర్ఎస్ కార్యకర్తల నినాదాలతో పద్మ దేవేందర్ రెడ్డికి స్వాగతం పలికారు. మల్కాపూర్ తండాలో  పద్మాదేవేందర్ రెడ్డి  గిరిజనులతో కలిసి వారి సంప్రదాయ దుస్తులు ధరించి ఆడి ఆడారు. 

బిఆర్ఎస్ లో చేరిన చందంపేట ఎంపీటీసీ

చిన్న శంకరంపేట మండల పరిధిలోని చందంపేట ఎంపీటీసీ సభ్యులు శివ కుమార్, రుద్రారం కాంగ్రెస్ పార్టీ  గ్రామ అధ్యక్షులు నరేష్ తో పాటు  80 మంది  కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. శివాయపల్లి, కొంటూర్  గ్రామాలకు చెందిన  కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పద్మాదేవేందర్ రెడ్డి సమక్షంలో  బిఆర్ఎస్ లో చేరారు. అదేవిధంగా నిజాంపేటకు మండలానికి చెందిన 50 మంది యువకులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు.