అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి

అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి
  • భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

భూదాన్ పోచంపల్లి, ముద్ర;రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి పురపాలక  కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనారిటీ మహిళా సెల్ అధ్యక్షురాలు సుల్తానా తో పాటు 40 మంది బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చేసిన అభివృద్ధి పనులకు ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలో చేరికయ్యామని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చిట్టిపొలు విజయలక్ష్మి శ్రీనివాస్, వైస్ చైర్మన్ భాత్క లింగస్వామి, బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్ రెడ్డి, నాయకులు తడక రమేష్, సీత వెంకటేష్, కొట్టం కరుణాకర్ రెడ్డి, అంకం పాండు, వంగూరి పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.