ఎమ్మేల్యే దత్తత గ్రామంలో అన్నీ సమస్యలే 

ఎమ్మేల్యే దత్తత గ్రామంలో అన్నీ సమస్యలే 
  • మెదక్ ఆత్మగౌరవ యాత్రలో డిసిసి అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి 

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజక వర్గంలోని బూర్గుపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన మెదక్ ఆత్మగౌరవ యాత్రలో డిసిసి అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి వాడవాడల పర్యటించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఎమ్మెల్యే దత్తత తీసుకున్న గ్రామం బూర్గుపల్లి అని, ఆ గ్రామంలో కనీస సౌకర్యాలు కూడా లేవని ఆయన ఎద్దేవ చేశారు. ఎమ్మెల్యేగా ఉండి కనీసం డబుల్ బెడ్ రూంలు, నూతన ఫించన్ లు అందని గ్రామం ఏదైనా ఉంటే  అది బూర్గుపల్లి  అని ఆరోపించారు. గుడిసెలో ఉన్న వాళ్ళందరికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పక్కా ఇల్లును మంజూరుచేస్తామని ఆయన హామి ఇచ్చారు.

అలాగే ఖాలీ స్థలం ఉంటే ఇల్లు కట్టుకోనికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తామని ప్రకటించారు. రైతన్నలు కూడా బ్యాంకుల్లో ఉన్న అప్పును ఎవరూ కూడా చెల్లించవద్దని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మొట్టమొదటగా రైతు రుణమాఫి 2 లక్షల రూపాయలను తప్పకుండా మాఫీ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిళ్ల ఆంజనేయులు, పల్లె రాంచందర్ గౌడ్, మంజుల సిద్ధగౌడ్, శ్రీనివాస్ గౌడ్,సత్యనారాయణ,రాములు, శ్యాంసుందర్, శ్రీనివాస్, పద్మరావు, రాములు, యదగౌడ్, రమేష్,రామారావు, మల్లేష్, ఇతరులు పాల్గొన్నారు.