రెవెన్యూ డివిజన్ కు మద్దతు తెలుపని దామోదర్  బాబు మోహన్ కు ఎందుకు ఓటేయాలి 

రెవెన్యూ డివిజన్ కు మద్దతు తెలుపని దామోదర్  బాబు మోహన్ కు ఎందుకు ఓటేయాలి 

పెద్దశంకరంపేట, ముద్ర: రెవెన్యూ డివిజన్ కోసం 45 రోజులు దీక్షలు, రాస్తారోకో, వంట వార్పు, ఆమరణ దీక్ష చేసినా  కూడా ఉద్యమానికి మద్దతు తెలుపని ప్రతిపక్ష నాయకులు మాజీ ఉపముఖ్యమంత్రి, దామోదర్ రాజనర్సింహ, బాబుమోహన్ లకు అల్లాదుర్గం ప్రజల నుంచి ఓటు వేయాలని అడిగే హక్కు లేదని జేఏసీ నాయకులు కంచరి బ్రహ్మం ప్రశ్నించారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ  ఈ ప్రాంత అభివృద్ధి కోసం జేఏసీ ఆధ్వర్యంలో పోరాటం దీక్షలు చేసిన బాధ్యతగల ప్రతిపక్ష నాయకులైన వీరు ఏ ఒక్క రోజు కూడా అల్లాదుర్గం అభివృద్ధి గురించి, రెవెన్యూ డివిజన్ చేయాలని మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. వెనుకబాటుతనానికి గురైన అల్లాదుర్గం ప్రాంతం సబ్ డివిజన్ చేసిన ఈ ప్రభుత్వం, ఎస్ టి ఓ, మంజూరైన గురుకుల పాఠశాల, సివిల్ కోర్టు, వంద పడకల ఆసుపత్రి, కళాశాల, తో పాటు రెవెన్యూ డివిజన్ చేయాలని పార్టీలకతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు, చేసిన ఏ ఒక్కరోజు కూడా సంఘీభావం తెలుపలేదని, మీడియా లో సైతం మద్దతు తెలుపని వీరికి ఈ ప్రాంతంపై ఎంత అభిమానం ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు.

వీటిపై పోరాడాల్సిన  ప్రతిపక్ష నాయకులు ఏనాడు అల్లాదుర్గం అభివృద్ధి గురించి మాట్లాడలేదని, 50 సంవత్సరాలు పాలించిన ఈ నాయకులు ఈ ప్రాంతానికి ఏమి చేశారని ప్రశ్నించారు. స్థానికేతరులైన వీరికి ఈ ప్రాంతంపై ఎందుకు అభిమానం ఉంటుందని, కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న చంటి క్రాంతి కిరణ్ మద్దతు తెలిపి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని, కార్యాలయం ఏర్పాటు చేస్తానని, రెవెన్యూ డివిజన్ కు సహకరిస్తానని మాట ఇవ్వడం గొప్ప విషయం అన్నారు, సాద్యాసాధ్యాలు ఎలా ఉన్నా, మాట ఇవ్వడం గొప్ప విషయమని అన్నారు. మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన క్రాంతి కిరణ్ అంచలంచెలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాడని, 50 సంవత్సరాలు పాలించిన స్థానికేతర ఎమ్మెల్యేలు  ఈ ప్రాంతం పై వివక్ష చూపారని, ఐదు సంవత్సరాల్లో అభివృద్ధి మొత్తం కావాలంటే సాధ్యం కాదని, అల్లాదుర్గం త్వరలో అసెంబ్లీ నియోజకవర్గం కానుందని, అల్లాదుర్గం. టేక్మాల్, రేగోడు, పెద్ద శంకరంపేట,  ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. రెవెన్యూ డివిజన్ కూడా ఖాయమని జోష్యం చెప్పారు. మంజురైన కోర్టు త్వరలో ప్రారంభమవుతుందని ప్రజలు అభివృద్ధికే సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డ్ మెంబర్ అంశి బాయ్. గోపాల్ నాయక్. సంగయ్య. రియాజ్, శివరాం, కిరణ్ కుమార్, తదితరులు పాల్గన్నారు.