MLA Padma Devender Reddy: కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడులు

MLA Padma Devender Reddy: కార్పొరేట్ కు ధీటుగా ప్రభుత్వ బడులు
MLA Padma Devender Reddy

మన ఊరు- మనబడిని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
ముద్ర ప్రతినిధి, మెదక్: కార్పొరేట్ స్థాయికి దీటుగా, ప్రభుత్వ బడులను తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం చిన్న శంకరంపేట మండలం గజగట్లపల్లి గ్రామంలో మనఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రాథమిక పాఠశాలకు 24 లక్షల నిధులతో అన్ని అంగులతో  ముస్తాబుచేయగా పాఠశాలను మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు భోజనం చేసేందుకు రేకుల షెడ్డు నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రధానోపాధ్యాయులు ప్రణీద్ అధ్యక్షతన ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని తెలిపారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల ఏర్పాటుచేసి పేద, మధ్యతరగతి వర్గాల పిల్లలకు ఉచితంగా విద్యను అందిస్తుందన్నారు. గ్రామాలలోని ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు మన ఊరు- మనబడి పథకం తోడ్పడుతుందన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్యతో పాటు మౌలిక సదుపాయాల కల్పన, అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం, విద్యుత్, మూత్రశాలలు, మరుగుదొడ్లు, కిచెన్ షెడ్లు,డైనింగ్ హాలు, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు కోసం లక్షల నిధులను పాఠశాల విద్యా కమిటీ ఖాతాలో జమ చేసిందన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం కల్పించే సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పిటిసి పట్లూరి మాధవి రాజు, సర్పంచ్ మీనా రవీందర్, నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత, ఎంపీడీవో ప్రవీణ్, డిఇఓ రమేష్ కుమార్, ఎంఈఓ యాదగిరి, డిఈ పాండురంగారెడ్డి,  ఏఈ విజయ్ కుమార్, విద్యా కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, నోడల్ అధికారి విశ్వనాథం చారి, సర్పంచుల పోరం అధ్యక్షులు పూలపల్లి యాదగిరి, లక్ష్మారెడ్డి, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజు, రవీందర్ నాగభూషణం ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.