ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం కృతజ్ఞత మహాసభలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ఆర్యవైశ్యులకు అండగా ప్రభుత్వం కృతజ్ఞత మహాసభలో ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:ఆర్య వైశ్యులకు ఎల్లప్పుడూ  ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు.రాష్ట్రాన్ని ఏలే మేధో సంపత్తి ఉన్న ఏకైక నేత కేసీఆర్ అని పేర్కొన్నారు. మెదక్ లో ఆదివారం రాత్రి మెదక్ ఆర్య వైశ్య మహాసభ ఆధ్వర్యంలో కృతజ్ఞత సభలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. కేంద్రం మద్దతు లేకపోయినా రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన ఘనత కెసిఆర్ దన్నారు. అందరి సహకారంతోనే జిల్లాను అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. మెదక్ లో ఎకరా స్థలంతో పాటు ఆర్యవైశ్య సంఘ భవనానికి కోటి రూపాయలు మంజూరు చేశామన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు విషయమై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్యులు మద్దతునివ్వాలని వేడుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్య వైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఆర్యవైశ్యులు సేవకు మారుపేరన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి నిరుపేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

అనంతరం పద్మ దంపతులను గజమాలతో ఘనంగా సన్మానించి జ్ఞాపిక అందజేశారు. అనంతరం మహిళలతో కలిసి ఆమె బతుకమ్మ ఆడి సందడి చేశారు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెదక్ మున్సిపల్ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, జెడ్పి ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, కౌన్సిలర్లు వనజ, ఆంజనేయులు, నాగరాజు, ఆత్మ అధ్యక్షులు అంజగౌడ్, పాక్స్ చైర్మన్ హన్మంత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు మెడిశెట్టి శ్యాంరావు, రాగి అశోక్, రాగి చక్రపాణి, బుక్క అశోక్, తొడుపునూరి శివరామ కృష్ణ, పురం వెంకట నారాయణ, కొండ శ్రీనివాస్, పద్మ తదితరులు పాల్గొన్నారు.