ఆర్ఓ కార్యాలయం పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ఆర్ఓ కార్యాలయం పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

ముద్ర ప్రతినిధి, మెదక్:సాధారణ ఎన్నికలు- 2023లో బాగంగా శుక్రవారం మెదక్ నియోజకవర్గo  ఆర్ఓ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలసి పరిశీలించారు. త్వరలో నామినేషాన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న సందర్భంగా ఆర్ ఓ కార్యలయoలో తీసుకోవలసిన  జాగ్రతలు, తగు సూచనలు చేశారు. ప్రతి నామినేషన్ పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించడం, ప్రతి రోజు వచ్చిన నామినేషన్ పత్రాన్ని డిస్ప్లే చేయాలని, ఎన్నికల నియమావళి కచ్చితంగా అమలు చేయాలన్నారు.  నవంబర్ 3న నామినేషన్ నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. ఎన్నికల నిబంధనలు డిసెంబర్ 5 తేదీ వరకు అమలులో ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఓ అంబ దాస్ రాజేశ్వర్, అడిషనల్ ఎస్పీ మహేందర్, డిఎస్పి ఫనిoదర్, తహసీల్దార్ శ్రీనివాస్ తదితరులున్నారు.