కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైంది ఎస్.పి  రోహిణి ప్రియదర్శిని

కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైంది ఎస్.పి  రోహిణి ప్రియదర్శిని
Medak SP Rohini Priyadarshini

ముద్ర ప్రతినిధి, మెదక్: కోర్టు కానిస్టేబుల్ బాధ్యత చాలా కీలకమైందని జిల్లా ఎస్.పి  పి.రోహిణి ప్రియదర్శిని అన్నారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా కోర్ట్ లో తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిది కిస్టాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రం లో భార్యను చంపిన భర్త కేసులో నిందితునికి 50 వేల రూపాయల జరిమానా, జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతాన్ని పెంచి బాదితులకు న్యాయం జరిగేలా కృషి చేసిన మెదక్ జిల్లా కోర్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ షేక్ ఫజల్ అహ్మద్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్ విట్టల్, కానిస్టేబుళ్లు లక్ష్మా రెడ్డి, రవీందర్ గౌడ్ లను శాలువాతో సత్కరించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ.. నేర రహిత సమాజంగా తీర్చిదిద్దాలంటే నిందితులకు కోర్టులో శిక్ష పడే విధంగా కోర్టు, పోలీసు సిబ్బంది శ్రమించాలని, ఇందుకోసం ఎఫ్ఐఆర్ నమోదు అయినప్పటి నుండి కేసు పూర్తయ్యేంతవరకు నిందితుల నేరాలను నిరూపించేందుకు అవసరమైన రుజువులు, పత్రాలు,సాక్షుల వాగ్మూలంను కోర్టుకు సమర్పించడంలో కోర్టు పోలీసు అధికారుల పనితీరులో వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న కోర్ట్ కానిస్టేబుల్ అధికారులు తమ విధుల్లో  భాగంగా ఎప్పటికప్పుడు ఎన్.బి.డబ్లూ.(నాన్ బేలబుల్ వారెంటులను) క్రమం తప్పకుండా అమలు పరిచి నేరస్తులకు శిక్షలు పడె విధంగా కృషిచేయాలని, కన్విక్షన్ రేటును మరింత  పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ సి.ఐ.శ్రీధర్, కోర్ట్ లైజనింగ్ ఆఫీసర్, కోర్ట్ కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.