ముస్లిం మైనార్టీ సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రాధాన్యత

ముస్లిం మైనార్టీ సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రాధాన్యత

 హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అలీ

ముద్ర ప్రతినిధి, మెదక్: ముస్లిం మైనార్టీల సంక్షేమానికి బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాలు ప్రవేశపెట్టిందని హజ్ కమిటీ చైర్మన్ మొహమ్మద్ సలీం, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ అలీ అన్నారు. సోమవారం మెదక్ భారత్ ఫంక్షన్ హాల్లో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వాలు ముస్లింలను పట్టించుకోలేదని ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ప్రవేశపెట్టలేనన్ని పథకాలను బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు చెప్పారు.

పేద ముస్లిం సోదరులను ఆదుకునేందుకు షాదీ ముబారక్, ఇమామ్ లను గౌరవిస్తూ రూ. 5 వేలు వేతనమిస్తున్నారని తిరిగి అధికారంలోకి వస్తే రూ.10 వేలు చేయనున్నట్లు చెప్పారు. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా 100 శాతం సబ్సిడీ కింద రుణాలు అందజేసి ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి కెసిఆర్ ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే మెదక్ బిఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నాయకులు ఖయుం చందా, పట్టణ మైనారిటీ అధ్యక్షులు కాజా సోహెల్, కార్యదర్శి ఫారోక్, మున్సిపల్ కౌన్సిలర్ సమియుద్దిన్, కోఆప్షన్ సభ్యులు ఉమర్ మోహియోద్దీన్, షోషల్ మీడియా కన్వీనర్ జుబేర్ అహ్మద్, అంజద్, అజ్గర్, షహీద్, ఉస్మన్, ముజీబ్, గౌస్, సాదిక్, మొహమ్మద్, అమెర్,మొయిజ్, ఖాదర్, సర్దార్ తదితరుల పాల్గొన్నారు.