కలెక్టరేట్లో ఉద్యోగులకు కంటి వెలుగు శిబిరం

కలెక్టరేట్లో ఉద్యోగులకు కంటి వెలుగు శిబిరం
Medak MLA Padma Devender Reddy

ముద్ర ప్రతినిధి, మెదక్: కంటి చూపుతో   బాధపడుతున్న వారికి  కంటి వెలుగు కార్యక్రమం ఒక వరం లాంటిదని 18  ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవలసినదిగా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో ఉద్యోగులకు ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని కలెక్టర్ రాజర్శి షాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవయవాలలో అన్నిటికన్నా ప్రధానమైనది కళ్ళని , ఏ చిన్న సమస్య వచ్చిన, కళ్ళు మసకగా కనిపించిన వెంటనే కంటి వెలుగు శిబిరాలలో వైద్య పరీక్షలు చేయించుకోవలసినదిగా సూచించారు.

వైద్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి మందుల, ఐ డ్రాప్స్, కంటి అద్దాలు పూర్తి ఉచితంగా   ఇస్తారని   ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ఆమె సూచించారు. అంతకు ముందు  కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛమిచ్చారు.  ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అదనపు కలెక్టర్లు ప్రతిమ సింగ్, రమేష్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి  చంద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు.