మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

ఇఫ్తార్ విందులో పాల్గొన్న మంత్రి హరీష్ రావు
ముద్ర ప్రతినిధి, మెదక్:  మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం మెదక్ షాదీ ఖానాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందులో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, అడిషనల్ కలెక్టర్ ప్రతిమసింగ్, జిల్లా మైనార్టీ అధికారి జమ్లా నాయక్,  ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో 250 కోట్ల రూపాయల కేటాయించడం జరిగిందని తెలిపారు.

ముస్లిం మైనార్టీలకు 250 ఇల్లు కేటాయించడం జరిగిందని, మిగిలిపోయిన అర్హులైన వారికి కూడా ఇస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ షాదిఖానలో మిగిలిపోయిన కిచెన్ షెడ్, టాయిలెట్ల నిర్మాణం కోసం 20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ ఆరెళ్ళ మల్లికార్జున్ గౌడ్, జడ్పీ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, ఆర్డెవో సాయిరాం, డిఎస్పీ సైదులు, తాసిల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు
హవేలి ఘనపూర్ మండల బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం శ్రీనివాస గార్డెన్లో నిర్వహించగా ముఖ్యఅతిథిగా మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. జిల్లా ఇంచార్జ్ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం,  స్థానిక ఎమ్మెల్యే బిఆర్ఎస్  జిల్లా పద్మాదేవేందర్ రెడ్డి హాజరయ్యారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని మంత్రి అన్నారు. జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మనలోని ఎంపీటీసీలు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.