డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మ.. దెబ్బతిన్న రోడ్, కల్వర్ట్ పరిశీలన

డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మ.. దెబ్బతిన్న రోడ్, కల్వర్ట్ పరిశీలన

ముద్ర ప్రతినిధి, మెదక్: రామాయంపేట పట్టణంలో డయాగ్నస్టిక్  సెంటర్ను  మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

అంతకుముందు మెదక్ మండలం తిమ్మానగర్ గ్రామం వద్ద  కోంటూర్  నుండి ఖాజాపూర్ వెళ్లే దారిలో భారీగా కురుస్తున్న వర్షాలకు దెబ్బతిన్న రోడ్డు, కల్వర్టును మెదక్ ఎమ్మెల్యే యం.పద్మ దేవేందర్ రెడ్డి, ఆర్ అండ్ బి ఈఈ వెంకటేశంతో కలిసి పరిశీలించారు.  కురుస్తున్న వర్షాలకు మట్టి కొట్టుకపోయి రోడ్ కల్వర్టును దెబ్బతిన్నదన్నారు. ఈ రోడ్డు కల్వర్టు (మైనర్ వంతెన) నిర్మాణానికి కోటి మంజూరయ్యాయని తెలిపారు. తొందర్లోనే టెండర్లు పిలిచి వంతెన నిర్మాణం పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట మెదక్ ఆత్మ కమిటీ చైర్మన్ అంజగౌడ్, ఏఈ రియాజ్, నాయకులు ఆంజనేయులు, నవీన్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

రామాయంపేట పట్టణంలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి  చేతుల మీదుగా రిలయన్స్ ట్రెండ్ ప్రారంభించారు.