మా పొట్ట కొట్టొద్దు - ఆటో డ్రైవర్ల ర్యాలీ, ధర్నా

మా పొట్ట కొట్టొద్దు - ఆటో డ్రైవర్ల ర్యాలీ, ధర్నా

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: మహాలక్ష్మి పథకం పేరుతో ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించి మా పొట్ట కొట్టొద్దని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆయా మండలాల ఆటో డ్రైవర్లు శుక్రవారం గాంధీ చౌరస్తా నుండి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆటో యజమానులు, ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ ఆటోలు నడుపుతూ కుటుంబాలను పోషించుకునే మాకు ఈ పథకం ద్వారా తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పునరాలోచించి మా జీవనోపాధి దెబ్బ తినకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. రాజారపు జైపాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సాదం భీమయ్య, ఎండి.మథిన్, శ్రీనివాస్, శేరి పెళ్లి విజయ్, ప్రశాంత్, శ్యామ్, గంగరాజు, ఎడ్ల ఎల్లయ్య, సమ్మయ్య, పోరునంది మధు, చింత ప్రవీణ్ కుమార్, సముద్రాల మహేందర్, మొగిలి వివిధ గ్రామాల ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.