100 శాతం ఓటింగే లక్ష్యం 

100 శాతం ఓటింగే లక్ష్యం 
  • కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ఆధ్వర్యంలో భారీ సైకిల్ ర్యాలీ

ముద్ర ప్రతినిధి, మెదక్:వంద శాతం తమ ఓటు హక్కు వినియోగించుకొని  మెతుకు సీమ సత్తా చాటాలని మెదక్ కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి  షా పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ,మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి  నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు కూడా ఓటు వేయండి అనే నినాదంతో  మంగళ మెదక్ కలెక్టరేట్ కార్యాలయం నుండి మెదక్ రాందాస్ చౌరస్తా వరకు ఆయా శాఖ అధికారులు, కళాశాల విద్యార్థులతో కలిసి సైకిల్ ర్యాలీలో పాల్గొన్నారు.

పండుగ వాతావరణంలో ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. మెదక్ జిల్లాలో 579 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు.నిష్పక్షపాతoగా, స్వచ్ఛందంగా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా మెదక్, నర్సాపూర్ జిల్లాలో ఉన్న ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ రోజు ఏక్కడికి వెళ్లకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓట్లు వేస్తామని రాందాస్ చౌరస్తాలో ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీ ఫణీందర్, అధికారులు నాగరాజు, బ్రహ్మాజీ, సాయిబాబ, గోవింద్, జమ్ల నాయక్, రాజిరెడ్డి ఎన్నికల సిబ్బంది, జిల్లా అధికారులు పాల్గొన్నారు.