కాళ్ళకల్ లో అనుమతి లేని నిర్మాణాల కూల్చివేత.. ప్రతిఘటిస్తున్న ప్రజలు పరిస్థితి ఉద్రిక్తత

తూప్రాన్, ముద్ర: ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా చేపట్టిన నిర్మాణాలను మనోహరాబాద్ మండలం  కాళ్ళకల్ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సుమారు 200 మందికిపైగా సిబ్బందితో పంచాయతి  అధికారుల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్త్ మధ్య గురువారం ఉదయం నుండి నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. గ్రామంలో ఇప్పటివరకు అనుమతి లేకుండా చేపట్టిన ప్రతి నిర్మాణాలను ఇళ్లను జేసీబీల సహాయంతో కూల్చివేత జరుగుతుంది. కూల్చివేతలను బాధితులు, ప్రజలు ప్రతి ఘటిస్తున్నారు. కాళ్ళకల్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తూప్రాన్ డిఎస్పి యాదగిరి రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్త్ ఏర్పాటు చేశారు. కూల్చివేతల విషయం తెలుసుకుని సిద్దిపేట డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి కళ్ళకల్ కు చేరుకుని బాధితులతో కలిసి కూల్చివేతలను అడ్డుకున్నారు. అనంతరం ర్యాలీగా గ్రామ కూడలి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కెసిఆర్ డౌన్ డౌన్ అంటూ ధర్నాకు దిగారు. వ్యాపార నిర్మాణాలను పట్టించుకోని అధికారులు పేదల ఇళ్లపై పడడం ఏంటని ప్రజలు ప్శ్నించారు.