ప్రభుత్వ పథకాల్లో అవినీతిని బట్టబయలు చేస్తాం - కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఫైర్ 

ప్రభుత్వ పథకాల్లో అవినీతిని బట్టబయలు చేస్తాం - కంఠారెడ్డి తిరుపతిరెడ్డి ఫైర్ 

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రభుత్వ పథకాలు నిరుపేదలకు అందజేయడంలో విఫలమైన బిఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డుపై వచ్చి దిష్టిబొమ్మలు దగ్దం చేయడం హేయమైన చర్య అని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ ఆత్మగౌరవ యాత్ర నార్సింగి మండలం సంకాపూర్, సంకాపూర్ తాండ, దర్గా తాండాలో పర్యటించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. 

ప్రభుత్వ పథకాల్లో అవినీతిని బట్టబయలు చేస్తామన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి పథకం వెనుక అవినీతి దాగి ఉందని తిరుపతి రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ నిరంకుశ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని... కాంగ్రెస్ కార్యకర్తలందరూ అలెర్ట్ గా ఉండి... దొరల చేతులో ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రభుత్వ పథకాల్లో ఉన్న అవినీతిని బాధ్యులను జైలుకు పంపడం ఖాయమని హెచ్చరించారు. కరెంట్ ఎన్ని గంటలు ఇస్తున్నారో లాగ్ బుక్ లు చూడాలని సూచించారు. 

ప్రభుత్వం ఉచితంగా 24 గంటల కరెంట్ ను రైతులకు అందజేస్తుందని ప్రగల్బాలు చెప్పుకునే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కసారి సబ్ స్టేషన్ లోకి వెళ్ళి కరెంట్ లాగ్ బుక్ లు పరిశీలించినట్లయితే ఎన్ని గంటలు కరెంట్ వస్తుందని మీకు స్పష్టంగా అర్థం అవుతుందని తిరుపతిరెడ్డి ఎద్దేవ చేశారు. పిసిసి అధ్యక్షులు రేవంతర్ రెడ్డి మాట్లాడిన మాటలను వక్రీకరించి ప్రజలను తప్పుద్రోవ పట్టించడం మీతరం కాదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలాల అధ్యక్షులు రమణ, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీమాన్ రెడ్డి, సంకాపూర్ ఉప సర్పంచ్ కేశవులు, జప్తి శివనూర్ గ్రామం అధ్యక్షుడు ఎండీ. పాషా బాయ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి, కిష్టయ్య, యాదగిరి, ప్రేమ్, అజయ్ గౌడ్, ఉదయ్, సిద్ధిరాములు, రామాగౌడ్, సుధాకర్, శంకర్ నాయక్, యాదగిరి, కరీం, రాజయ్య, శంకర్, కిష్టయ్య, సురేష్, లక్ష్మణ్, సంతోష్, వెంకట్, అంజయ్య, రాజయ్య, సత్తయ్య, యాదగిరి యాదవ్, సంకపూర్ తండా అధ్యక్షులు రాజు నాయక్, దేవి, రవి, భాస్కర్, శంకర్ నాయక్ లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గోన్నారు.