వన్​డే సీజే

వన్​డే సీజే

  • హైకోర్టు యాక్టింగ్ సీజేగా జస్టిస్ నవీన్​రావు
  • ఉదయం బాధ్యతలు, సాయంత్రం రిటైర్మెంట్
  • తరువాత నుంచి తాత్యాలిక సీజేగా జస్టిస్ అభినంద్ కుమార్​షావిలి 

ముద్ర, తెలంగాణ బ్యూరో:హైకోర్టులో యాక్టింగ్ సీజేగా జస్టిస్ నవీన్ రావు శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించనున్నారు. సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు. శనివారం నుంచి తాతాల్కిక సీజేగా జస్టిస్​ అభినంద్ కుమార్ షావిలి బాధ్యతలు చేపడతారు. హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఉజ్జల్ భూయాన్​ సుప్రీం కోర్టు జడ్జిగా నియమితులైన విషయం తెలిసిందే. జస్టిస్​ కన్నెగంటి లలిత కుమారి కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో యాక్టింగ్ సీజేగా జస్టిస్ నవీన్​ కుమార్​కు అవకాశం వచ్చింది. శుక్రవారమే ఆయన సీజేగా పదవీ విరమణ చేయనున్నారు. ఈ సందర్భంగా జస్టిస్ నవీన్​రావుకు ఘనంగా వీడ్కోలు పలుకనున్నారు. ఈ మేరకు బార్ అసోసియేషన్ ఏర్పాట్లు చేసింది.​జ‌స్టిస్ ఉజ్జల్ భూయాన్‌కు తెలంగాణ హైకోర్టు గురువారం ఘ‌నంగా వీడ్కోలు ప‌లికింది. ఈ వేడుక‌లో హైకోర్టు న్యాయ‌మూర్తులు, న్యాయ‌వాదులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నిరుడు జూన్​ 28 నుంచి గురువారం వరకు జస్టిస్‌ భూయాన్‌ తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్నారు.