బిహార్​ అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత

బిహార్​ అసెంబ్లీ ముట్టడిలో ఉద్రిక్తత
  • పోలీసుల లాఠీచార్జితో బీజేపీ నేత మృతి
  • తీవ్రంగా ఖండించిన జేపీ నడ్డా
  • మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిక

బిహార్​: బిహార్​డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్​రాజీనామా చేయాలని డిమాండ్​చేస్తూ బీజేపీ చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర రూపం దాల్చింది. గురువారం పాట్నాలో బీజేపీ కార్యకర్తలు, నేతలు ఆందోళనలకు దిగి అసెంబ్లీని ముట్టడించేందుకు పలు ప్రాంతాల నుంచి బయలుదేరారు. తేజస్వికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. భాష్పవాయువు ప్రయోగించారు. కాగా జెహనాబాద్​లో జరిగిన లాఠీచార్జిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి విజయ్​కుమార్​సింగ్ పోలీసు దెబ్బలకు తాళలేక మృతి చెందాడు. చాలామందికి చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరికి తలలు పగిలాయి. దీంతో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, బిహార్​ప్రభుత్వ నిరంకుశ చర్యకు మూల్యం చెల్లించుకోకతప్పదన్నారు. మృతిచెందిన నేత కుటుంబానికి తన సంతాపం ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మహాకూటమి అవినీతి కోటను కాపాడుకునేందుకే ప్రజాస్వామ్యంపై బిహార్​నితీశ్​ ప్రభుత్వం దాడికి పాల్పడిందని ఆరోపించారు. అంతకుముందు అసెంబ్లీలో తేజస్వియాదవ్​రాజీనామా చేయాలని స్థానిక బీజేపీ ఎమ్మెల్యేలు బయట ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల అంశాన్ని లేవనెత్తడంతో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ సభ్యులు స్పీకర్​చుట్టూ చేరి నితీశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగానినాదాలు చేశారు. ఇద్దరు ఎమ్మెల్యేలను బయటికి పంపించారు. దీంతో ఆగ్రహించిన మిగతా నేతలంతా అసెంబ్లీ నుంచి బయటికి వచ్చి నితీశ్​ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతూ ర్యాలీగా బయలుదేరారు.