IT Raids In BBC Offices బీబీసీలో ఐటీ సోదాలు

IT Raids In BBC Offices బీబీసీలో ఐటీ సోదాలు
IT Raids In BBC Offices
  • ఏకకాలంలో 20 చోట్ల తనిఖీలు..
  • కంప్యూటర్లు, ఫోన్లలోని సమాచార సేకరణ
  • పన్నులు ఎగవేశారంటున్న ఐటీ..
  • డాక్యుమెంటరీపై కక్షగట్టారంటున్న విపక్షాలు

న్యూఢిల్లీ: ఢిల్లీ, ముంబైతో 20 చోట్ల పలు వేర్వేరు ప్రాంతాల్లో BBC (British Broadcasting) బీబీసీ (బ్రిటిష్​ బ్రాడ్​కాస్టింగ్​ లిమిటెడ్​ మీడియా రంగం)పై ఐటీ రైడ్స్​ జరిగాయి. కాగా ఇవి ఐటీ రైడ్స్​ కావని కేవలం ఆర్థిక లావాదేవీల్లో అవకతవకల కారణంగా సోదాలు మాత్రమే నిర్వహించామని ఐటీ అధికారులు చెబుతుండటం విశేషం. మంగళవారం ఉదయం 70 మంది ఐటీ శాఖాధికారులు BBC New Delhi office బీబీసీ న్యూఢిల్లీ కార్యాలయం 5, 6 అంతస్థుల్లో అకౌంట్స్​, ఫైనాన్స్​ విభాగాల్లో సోదాలు నిర్వహించారు. ఆ అంతస్థుల్లో పనిచేస్తున్నవారి మొబైల్​ఫోన్లు, ల్యాప్​ట్యాప్​లు, కంప్యూటర్లు తదితరాలలో నిక్షిప్తమైన ఆర్థిక లావాదేవీలను హార్డడిస్క్​లలో సమాచారాన్ని సేకరించారు. ఈ దాడులు దేశవ్యాప్తంగా ఉన్న పలు బీబీసీ కార్యాలయాల్లో జరిగాయి.

మీడియా కార్యాలయంలో సోదాల విషయాన్ని భారత ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వానికి అందజేసినట్లు సమాచారం. ఆర్థిక లావాదేవీల్లో పెద్ద ఎత్తున అవకతవకలు చోటు చేసుకున్నాయని, పన్నులను ఎగవేసినట్లు సమాచారం ఉందని, విదేశీ నిధులను రప్పించుకొని దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తూ వాటికి పన్ను కట్టలేదని ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాగా ఐటీ అధికారులు ఇక్కడి నుంచి ఏమీ తీసుకువెళ్ళడానికి లేదని కేవలం సమాచారాన్ని మాత్రం సేకరించి తిరిగి వాటిని యథాస్థానంలో వారి వారికి అప్పజెప్పి వెళతామని ఐటీశాఖాధికారులు స్పష్టం చేశారు.

ఐటీదాడులపై విపక్షాలు గుర్రుమంటున్నాయి

ఇటీవలో ప్రధాని నరేంద్రమోడీపై బీబీసీ డాక్యుమెంటరీని ప్రదర్శించింది. ఇది దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్నే రేపి ఆయన ఇమేజ్​ను దెబ్బతీసేలా ఉండడంతో నే బీజేపీ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యున్నత మీడియా సంస్థ బీబీసీపై కక్షకట్టిందని ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలోనే దాడులు జరుగుతున్నాయని వెల్లడించింది. ఈ చర్యను ముక్తకంఠంతో దేశమీడియా, దేశవాసులు, పార్టీలు ఖండించాలని బీజేపీ గొంతునొక్కే చర్యలు మానుకోవాలని కాంగ్రెస్​ సీనియర్​ నేత జైరాం రమేష్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీపై డాక్యుమెంటరీ విషయంలో ఇప్పటికే సుప్రీంకోర్టు డాక్యుమెంటరీని ప్రస్తుతం నిలిపివేయాలనే ఆదేశాలిచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలోనే దాడులు జరిగాయని అందరూ ఆరోపిస్తుండగా, అబ్బే అదేం లేదు బీబీసీ ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశ సమగ్రతను దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని పలువురు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.