శివంగులనే భయపెట్టిన ముంగిస

శివంగులనే భయపెట్టిన ముంగిస

ఎంతటి విపత్తు ఎదురైనా కూడా ధైర్యం, పట్టుదల సడలిపోకుండా పోరాడితే విజయం సిద్ధిస్తుందనడానికి ఈ వీడియో ప్రబల సాక్ష్యంగా నిలుస్తుంది. అడవిలో మూడు శివంగులు (ఆడ సింహాలు) విహరిస్తున్న సమయంలో ఒక ముంగిస కంటపడింది. దాన్ని ఎలాగైనా గుటుక్కుమనిపించుకోవాలని ఆ శివంగులు ప్రయత్నించాయి. అయితే, తనకంటే సైజ్ లో ఎంతో పెద్దవైనా కూడా వాటికి ఎదురొడ్డి భయపెట్టింది. ప్రాణాలకు తెగించి పోరాడితే, ఎంతటి బలశాలినైనా భయపెట్టవచ్చునని చూపుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- ముద్ర సెంట్రల్ డెస్క్