ఏపీలో భారీగా ఐఎఎస్ ల బదిలీలు

ఏపీలో భారీగా ఐఎఎస్ ల బదిలీలు

అమరావతి, ముద్ర వార్తలు: ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా భారీగా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఎఎస్) అధికారులు బదిలీలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కార్యదర్శిగా ప్రద్యుమ్న నియమితులయ్యారు. పాఠశాల విద్య కార్యదర్శిగా కోన శ్రీధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్ డీఏ) కమిషనర్ గా కాలమనేని భాస్కర్, జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా సాయిప్రసాద్ నియమితులయ్యారు. అలాగే పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా శశిభూషణ్ కుమార్, పురపాలక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్ కుమార్ సింఘాల్, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక కార్యదర్శిగా గోపాలకృష్ణ ద్వివేది , పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా సిద్ధార్థ్ జైన్ లను నియమించారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన శ్రీలక్ష్మి, రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాశ్ లను జీఏడీకి రిపోర్ట్ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. మొత్తం 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేశారు.