ఒడిశా అసెంబ్లీలో తాజా, మాజీ ముఖ్యమంత్రుల పరస్పర అభివాదం

ఒడిశా అసెంబ్లీలో తాజా, మాజీ ముఖ్యమంత్రుల పరస్పర అభివాదం

ముద్ర వార్తలు, సెంట్రల్ డెస్క్: ఒడిశా రాష్ట్రానికి 24 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన బిజూ జనతాదళ్ సీనియర్ నేత నవీన్ పట్నాయక్, ప్రస్తుత సీఎం మోహన్ మాంఝీలు విధానసభలో ఎంత హుందాగా వ్యవహరించారో ఈ చిత్రం చెబుతుంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ ను కాదని భారతీయ జనతా పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. 147 అసెంబ్లీ స్థానాలున్న ఒడిశా శాసనసభలో మ్యాజిక్ ఫిగర్ 74ను దాటి 78 స్థానాలతో కమలం పార్టీ అధికారం కైవసం చేసుకుంది. 51 స్థానాలతో రెండోస్థానంలో నవీన్ పట్నాయక్ సారథ్యంలోని బిజూ జనతాదళ్ రెండోస్థానంలో నిలిచింది. బీజేపీ కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాంఝీని నియమించిన విషయం విదితమే. ఒడిశా అసెంబ్లీ తొలి సమావేశాలు మొదలైన తర్వాత సభ్యులు ఎంత హుందాగా ప్రవర్తిస్తున్నారో చూడండి. 24 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నవీన్ పట్నాయక్ సభలో ప్రవేశించగానే తన సీట్ నుంచి లేచిమరీ నూతన ముఖ్యమంత్రి  మోహన్ మాంఝీ నమస్కరించి ఎలా పలకరించారో చూడండి. అంతే హుందాగా బీజేపీ, బీజేడీ సభ్యులు కూడా ఒకరి పట్ల మరొకరు గౌరవం పాటించారు. ఇదీ.. భారత ప్రజాస్వామ్యం గొప్పతనం.