జైలులో భద్రత లేదు ఎల్జీకి సుఖేష్​లేఖ

జైలులో భద్రత లేదు ఎల్జీకి సుఖేష్​లేఖ

ఢిల్లీ: రూ. 200 కోట్ల మానీలాండరింగ్ కేసులో జైలులో సుఖేష్ చంద్రశేఖర్ మళ్లీ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుతం అతను ఉంటున్న జైలులో తనకు భద్రత లేదని.. తనను చంపాలని ప్రయత్నిస్తుంటున్నారంటూ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించి ఢిల్లీ లెఫ్టినెంటే గవర్నర్ వినయ్ కుమార్ సక్సెనా లేఖ రాశారు. సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. గతంలో అతను తిహార్ జైలులో ఉండగా ఆ తర్వాత మండోలి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జులై 1 న సుఖేష్.. తనకు బెదిరింపు కాల్ వచ్చిందని తన అడ్వకేట్ అనంత్ మాలిక్‌కు లేఖ రాశారు. అందులో ఆ లేఖను అత్యవసర నోటీసుగా పరిగణించాలని కోరారు. గతంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై చేసిన స్టేట్‌మెంట్లను వెనక్కి తీసుకోవాలని.. లేదంటే తనకు జైల్లో పెట్టే ఆహారంలో విషం కలిపి చంపేస్తామని బెదిరిస్తున్నారని తెలిపాడు. జైలు నిర్వహణ ఢిల్లీ ప్రభుత్వం అధీనంలోనే ఉందని.. కాల్ చేసిన వ్యక్తి కేజ్రివాల్‌తో పాటు ఢిల్లీ మాజీ సీఎం సత్యేంద్రజైన్, ఆమ్ ఆద్మీ పార్టీ పేరును ప్రస్తావించారని చెప్పాడు. అలాగే జూన్ 23న తన తల్లికి కూడా ఇలాంటి బెదిరింపు కాల్ వచ్చిందని పేర్కొన్నాడు. సత్యేంద్రజైన్ భార్య తన తల్లికి ఫోన్ చేసిందని.. కేజ్రీవాల్‌పై తాను చేసిన ఫిర్యాదులు వెనక్కి తీసుకోనేలా చేయాలని బెదిరించిందని తెలిపాడు. అలాగే జైలు అధికారులు కూడా తనను బెదిరిస్తున్నారని.. మండోలి జైలలో భద్రత లేదని చెప్పాడు. దయచేసి ఈ జైలు నుంచి వేరే జైలుకు బదిలీ చేయాలని కోరాడు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఆధినంలో లేని మరో రాష్ట్రంలో ఉన్న జైలుకు పంపించాలని వేడుకుంటున్నాను అని లేఖలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం సుఖేష్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.