కేజ్రీవాల్​కు మళ్లీ షాక్​

కేజ్రీవాల్​కు మళ్లీ షాక్​

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పుపై హైకోర్టు స్టే ఇచ్చింది. నిన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది. లక్ష రూపాయలు డిపాజిట్ చెల్లించి బెయిల్ పొందవచ్చని తెలిపింది. దీంతో ఆయన ఈరోజు బెయిల్ పై తీహార్ జైలు నుంచి విడుదలవుతారని భావించారు. కానీ రౌజ్‌ అవెన్యూ కోర్టు బెయిల్‌ మంజూరు చేయడాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు దిల్లీ హైకోర్టులో సవాల్‌ చేశారు. అత్యవసర విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టులో విచారణ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సుధీర్ కుమార్ జైన్, జస్టిస్‌ రవీందర్ దూదేజాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తాము విచారించే వరకు ట్రయల్ కోర్టు ఆదేశాలు అమలు కావని తెలిపింది.