గత మీ ప్రభుత్వ హాయంలో రోడ్ల దుస్థితి ఇలా ఉండేది, పుట్ట

గత మీ ప్రభుత్వ హాయంలో రోడ్ల దుస్థితి ఇలా ఉండేది, పుట్ట
  • కేశనపల్లిలో  అప్పుడు ధ్వంసం అయిన రోడ్డు పరిస్థితి ప్రజలకు తెలువదా
  • అభివృద్ధికి నిలువుటెత్తు నిదర్శనం దుద్దిళ్ల కుటుంబం
  • ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదు పుట్ట 
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు చొప్పరి సదానందం...
  • మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: గత మీ ప్రభుత్వ హాయంలో రోడ్ల దుస్థితి పుట్ట ఇలా ఉండేదని, మండలంలోని కేశనపల్లిలో  ధ్వంసం అయిన రోడ్డు పరిస్థితి ప్రజలకు తెలువదా...అభివృద్ధికి నిలువుటెత్తు నిదర్శనం దుద్దిళ్ల కుటుంబమని, ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు నీకు లేదు పుట్ట అని  పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ చొప్పరి సదానందం, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ లు అన్నారు.

మంగళవారం ముత్తారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మంథని నియోజక వర్గంలో గోదావరి, మానేరు నదులలో అక్రమంగా ఇసుక తరలించడం ప్రారంభించింది, మీ బీఆర్ఎస్ ప్రభుత్వం కాదా పుట్ట మధు అని వారు ప్రశ్నించారు. అధికలోడు, అధికలోడు అని అరుస్తున్నావే ఈ ప్రభుత్వంలో ఒక్క లారీలో నైనా అధికలోడు పోయిందా... ఒక్క అధిక లోడు  చూపిస్తే మేము దేనికైనా సిద్ధం అని వారు మధును ప్రశ్నించారు. మండల కేంద్రంలో మానేరు నుంచి ఇసుకలోడుతో వెళ్తున్న లారీలను ఆపి  డ్రైవర్లతో మాట్లాడారు.  

డ్రైవర్లు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చాక అధిక లోడుతూ లారీలలో పోతలేమని, గత ప్రభుత్వంలోనే పోయామని వారు తెలిపారు. రాజకీయ స్వార్థం కోసం ప్రభుత్వాన్ని విమర్శిస్తే చూస్తూ ఊరుకుండబోమని పుట్ట ను వారు హెచ్చరించారు. అభివృద్ధి అంటే దుద్దుల కుటుంబమని మంత్రి నియోజక వర్గం అభివృద్ధి చెందింది అంటే గతంలో శ్రీపాధరావు, ఇప్పుడు శ్రీధర్ బాబు అన, తండ్రికి తగ్గ తనయుడిగా మంథని నియోజకవర్గాన్నే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకపోతున్న గొప్ప వ్యక్తి తమ నాయకుడు శ్రీధర్ బాబు అన్నారు. తమ నాయకుని జోలికి వస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మద్దెల రాజయ్య, రాపల్లి రామన్న, గాదం శ్రీనివాస్, లక్కం ప్రభాకర్,  ఆకోజు అశోక్ చారి, బొడ రత్నాకర్ గౌడ్, చెలకల ఓదెలు యాదవ్, చల్ల సది, తాడవేణి శంకర్,