7  రోజుల్లో పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి...

7  రోజుల్లో పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి...
  • దరఖాస్తుదారులకు ముందస్తుగా సమాచారం అందించి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి
  • పెండింగ్ ధరణి దరఖాస్తుల పరిష్కారంపై సంబంధిత తహసిల్దార్ లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్


ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులను 7 రోజుల్లో పరిష్కరించి పెండింగ్ జీరో చేయాలని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో విచారించి డిస్పోజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.శుక్రవారం  కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పెండింగ్ ధరణి దరఖాస్తుల డిస్పోజల్ పై అదనపు కలెక్టర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి సంబంధిత తహసిల్దార్, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. 

ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ   పెండింగ్ ధరణి దరఖాస్తులను డిస్పోజ్ చేయాలని, దీని కోసం మండలంలో రెవెన్యూ అధికారులు ప్రణాళిక బద్ధంగా పనిచేయాలన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుందని , టీఎం 4,10,14,32 మొదలగు మాడ్యుల్స్ లలో ఉన్న సక్సెషన్, జిపిఏ/ఎస్.పీ.ఏ, భూ రికార్డుల అంశాలలో ఫిర్యాదులు, ఖాతా మేర్జింగ్ సంబంధిత దరఖాస్తులు తహసిల్దార్ స్థాయిలోరికార్డులు పరిశీలించి, క్షేత్రస్థాయి సిబ్బంది అందించిన నివేదికల ప్రకారం తహసిల్దార్ సదరు దరఖాస్తులను ఆమోదం లేదా తిరస్కరించాలని, తిరస్కరించిన దరఖాస్తులకు తగిన కారణాలు తెలియజేయాలని తెలిపారు. టీఎం 7,16,20,22,26,33 మాడ్యుల్స్ లో ఉన్న నాలా (పాస్ బుక్ లేకుండా), భూ సేకరణ ఫిర్యాదులు, ఎన్.ఆర్.ఐ పోర్టల్, సంస్థల పట్టా పాస్ పుస్తకం, కోర్టు కేసులు, మిస్సింగ్ సర్వే నెంబర్, విస్తీర్ణ సవరింపు (5 లక్షల విలువ వరకు)  మొదలగు దరఖాస్తులను తహసిల్దార్లు  క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించి సిఫార్సులతో రెవెన్యూ డివిజన్ అధికారికి పంపాలని, సదరు రెవెన్యూ డివిజన్ అధికారి ఆ దరఖాస్తులపై తుది నిర్ణయం తీసుకోవాలని, తిరస్కరించే దరఖాస్తులపై కారణాలను తెలియజేయా లని కలెక్టర్ పేర్కొన్నారు. 

కె & ఎల్ ఫారం, టిఎం 3,4,15,23,24, 31, 33 మాడ్యుల్స్ లో ఉన్న మ్యూటేషన్,అసైన్ భూముల సక్సేషన్ (పిపిబి లేకుండా), ప్రొహిబిటెడ్ జాబితా ఆస్తుల సమస్యలు, పట్టా పాస్ పుస్తకం సెమీ అర్బన్ ల్యాండ్ పట్టా పాస్ పుస్తకం కోర్టు కేసులు, నాలా కన్వర్జేషన్, పట్టా పాస్ పుస్తకంలో సవరింపులు మొదలగు దరఖాస్తులపై కలెక్టర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని, కె&ఎల్ ఫారం దరఖాస్తులను రెవెన్యూ డివిజన్ అధికారి, మిగిలిన మాడ్యూల్స్ దరఖాస్తులను తహాసిల్దారులు క్షేత్రస్థాయిలో విచారించి నివేదిక అందించాలని, వాటి ఆధారంగా కలెక్టర్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులు పరిష్కారానికి ప్రతి మండలంలో తహసిల్దార్, డిప్యూటీ తహసిల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని, ప్రతి బృందానికి కేటాయించిన పెండింగ్ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారించి 7 రోజుల్లో డిస్పోజ్ చేయాలని అన్నారు.క్షేత్రస్థాయిలో విచారణకు వెళ్లే ముందు దరఖాస్తుదారులకు అవసరమైన డాక్యుమెంట్లతో సిద్ధంగా ఉండాలని  సమాచారం అందించాలని అన్నారు. ప్రతిరోజు పెండింగ్ దరఖాస్తుల డిస్పోజల్ పురోగతి తెలియజేయాలని తెలిపారు. 
ఈ సమావేశంలో తహసిల్దార్ లు, సంభందిత రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.