జిల్లాలో ఇసుక లభ్యతపై కట్టుదిట్టమైన నివేదిక సమర్పించాలి - జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

జిల్లాలో ఇసుక లభ్యతపై కట్టుదిట్టమైన నివేదిక సమర్పించాలి - జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: జిల్లాలోని ఇసుక  రీచ్ లలో ఉన్న ఇసుక లభ్యతపై కట్టు దిట్టమైన నివేదిక తయారు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని తన  చాంబర్ లో కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.

 
ఈ సందర్భంగా  కలెక్టర్  మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 26 ఇసుక రీచ్ లను మరోసారి మైనింగ్, రెవెన్యూ, భూగర్భ జలాలు, నీటి పారుదల శాఖ, టిఎస్ఎండిసి శాఖలు సంయుక్తంగా పరిశీలించి,  అక్కడ అందుబాటులో ఉన్న ఇసుక పై కట్టుదిట్టమైన నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. జిల్లాలో నిర్వహించే నీటిపారుదల ప్రాజెక్టు పనులకు, ప్రభుత్వ కార్యక్రమాలకు ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, సాయంత్రం 6 గంటల తరువాత ఇసుక రీచ్ లో నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ వే బిల్లు జారీ చేయవద్దని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో మైనింగ్ శాఖ ఎడి సాయి నాథ్, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.