పెద్దపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే గెజిటెడ్ అధికారులు సభ్యత్వం తీసుకోని సహకరించాలి

పెద్దపల్లి జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే గెజిటెడ్ అధికారులు సభ్యత్వం తీసుకోని సహకరించాలి
  • పెద్దపల్లి జిల్లా టీజీఓ ఎస్ జిల్లా అధ్యక్షులు తూము  రవీందర్ పటేల్


ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:  జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే గెజిటెడ్ అధికారులు సభ్యత్వం తీసుకోని సహకరించాలని పెద్దపల్లి జిల్లా టీజీఓ ఎస్ జిల్లా అధ్యక్షులు తూము  రవీందర్ పటేల్ కోరారు. శుక్రవారం తెలంగాణ గెజిటెడ్ అధికారుల అసోసియేషన్ ప్రాథమిక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర  టీజీఓ ఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, తాజా మాజీ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ, రాష్ట్ర కమిటీ సభ్యులు పెద్దపల్లి జిల్లాలో పర్యటిస్తున్న సందర్భంగా  వారిని' టీజీఓఎస్ జిల్లా అధ్యక్షులు తూము  రవీందర్ పటేల్ మర్యాద పూర్వకంగా ఆహ్వానించి సభ్యత్వ నమోదు కార్య్రక్రమం ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేసే గెజిటెడ్ అధికారులు సభ్యత్వం తీసుకొని ఈ కార్యక్రమంను విజయవంతం చేయాలని రవీందర్ పటేల్ కోరారు. జిల్లాలోని ఇరిగేషన్ శాఖ, పశుసంవర్ధక శాఖ, ప్రభుత్వ ఐటీఐ ల, గెజిటెడ్ లైబ్రేరియన్లు, సంక్షేమ శాఖలు, రెవెన్యూ శాఖ, వ్యవసాయ శాఖల సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్య క్రమంలో జిల్లా కార్య వర్గ సభ్యులు అలివేని, రవూఫ్ ఖాన్, డా.,రవీందర్ రెడ్డి, డా.కుమార స్వామి, రామచంద్రా రెడ్డి, కవిత, సుగుణ, విజయ, విజయ పాల్ రెడ్డి, నర్సింహ చారి, సురేందర్, శ్రీనివాస్, దత్తాత్రి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.